జగన్ బెయిల్ ఫై సోమవారం సిబిఐ వాదనలు
posted on Dec 14, 2012 @ 12:57PM
బెయిల్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పెట్టుకొన్న పిటీషన్ ఫై ఆయన వాదనలు పూర్తి అయ్యాయి. కాగా, సిబిఐ తన వాదనను సోమవారం వినిపించనుంది.
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జగన్ ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్లో చంచల్ గూడా జైలులో ఉన్నారు. ఆయన కోర్టులో దాఖలు చేసిన స్టాట్యూటారీ బెయిల్ పిటీషన్ ఫై జగన్ తరపు న్యాయవాది వాదనలను పూర్తి చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 167 (2) ప్రకారం అరెస్టు చేసిన 90 రోజుల్లోపు సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేయనందున జగన్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోర్టు ను కోరారు. సిబిఐ వాదనల్లో కొత్త ఏమీ లేదని, ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని ప్రతి సారీ కోర్టుకు చెపుతూ వస్తోందని అందువల్ల జగన్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది పద్మనాభ రెడ్డి కోర్టును కోరారు.
జగన్ పెట్టుకొన్న మరో పిటీషన్ ఫై కూడా సిబిఐ గురువారం కౌంటర్లు దాఖలు చేసింది. ఈ పిటీషన్ కు సంభందించి సిబిఐ సోమవారం తన అభ్యంతరాలను కోర్టులో చెప్పనుంది.