రాహుల్ సారీ ఇదిఎన్నోసారి ..
posted on Jun 14, 2022 @ 3:04PM
కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల గాంధీ మరో మారు, క్షమాపణ చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు, ఈడీ అధికారులకు క్షమాపణ చెప్పారు. నిన్న (సోమవారం) ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో అధికారులకు క్షమాపణలు చెప్పారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈరోజు (మంగళవారం) వాంగ్మూలం నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటానని రాహుల్ చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పడం ఇదే మొదటి సారి కాదని, గతంలో ఆయన, అనేక సందర్భాలలో వివాదాస్పద, అసత్య వ్యాఖ్యలు చేసి, న్యాయస్థానాలకే కాదు, పార్లమెంట్’కు కూడా క్షమాపణలు చెప్పారని రాజీయ పరిశీలకు గుర్తు చేస్తున్నారు. మాట తడబడి పార్లమెంట్ ‘కి సైతం క్షమాపణలు చెప్పారని పరిశీలకు గుర్తు చేస్తున్నారు.మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం,పేరును స్పష్టంగా పలక లేక, తడబడి నవ్వుల పాలైన సందర్భంలో, రాహుల గాంధీ పార్లమెంట్’లో జోవియల్ గానే కావచ్చును, సారీ.. సారీ ... సారీ అంటూ సభలో నవ్వులు పూయించారు.
అదలా ఉంటే, 2014 ఎన్నికల ప్రచార సభల్లో మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కుట్ర చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ ఆరోపణల ఆధారంగా ఆర్ఎస్ఎస్ భివాండి (మహారాష్ట్ర) కోర్టులో పరువు నష్టం దావా వేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ గాంధీ, ఆరోపణలు అవాస్తమని నిర్ధారించడంతో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్’కు, న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు.
ఇక రఫేల్ కేసుకు సంబంధించి 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ, ‘చౌకీదార్ చోర్ హై' అనే స్లోగన్ కాయిన్ చేశారు. ప్రధాని మోడీని ‘దొంగ’ గా అభివర్ణిస్తూ ప్రచారం సాగించారు. అంతే కాకుండా, ఇందుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానమే, ప్రధానిని తప్పు పట్టిందని తప్పుడు ప్రచారం చేశారని న్యాయస్థానం తప్పు పట్టింది. ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. అమేథి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ఉద్దేశించి చౌకీ దార్ చోర్ హై’ అని సుప్రీంకోర్టు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రాహుల్ గాంధీని తీవ్రంగా మందలించింది. ఆయన వివరణ ఇచ్చారు. క్షమాపణ చెప్పారు. అది కూడా ఒకసారి కాదు, రెండు సార్లు. వివరాల్లోకి వెళితే, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి మీనాక్షి లేఖి కోర్టు ధిక్కార కేసు పెట్టారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు రాహుల్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చౌకీదార్ వ్యాఖ్యలపై కోర్టును తప్పుదోవ పట్టించడం సబబు కాదని రాహుల్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ ఇప్పటివరకు క్షమాపణ ఎందుకు చెప్పలేదని, చింతించడం అనే పదం కోసం 22 పేజిల అఫిడవిట్ ఏంటని సుప్రీం ఆగ్రహించింది. రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి క్షమాపణలు చెప్పారు. కోర్టును కించపరచే ఉద్దేశం లేదని, క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేస్తానని రాహుల్ సుప్రీంకు వివరణ ఇచ్చారు.
ఇక ప్రస్తుతానికి వస్తే,నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కుంటున్నకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు, ఈడీ అధికారులకు క్షమాపణ చెప్పారు. ఈడీ విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో అధికారులకు క్షమాపణలు చెప్పారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈరోజు (మంగళవారం) వాంగ్మూలం నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటానని రాహుల్ చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.అదలా ఉంటే, నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు విచారణకు ఎదుర్కుంటున్న రాహుల గాంధీకి కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు నేతలు సంఘీభావం తెలిపారు.