సారీ దీదీ.. కే.కే వస్తారు.. మమతా సమావేశం పట్ల కేసీఆర్ కినుక?
posted on Jun 14, 2022 @ 3:24PM
ఎన్నో ఆశలతో తన ఆలోచనాసరళికి దగ్గరున్నవారిని కలిసి గొప్ప కార్య్రకమం, ఉద్యమం చేపడదామను కున్నవారికి అనుకున్న స్థాయిలో మద్దతు లభించకుంటే ఎంతో బాధ కలుగుతుంది. ఊహించిన స్నేహ బంధం ఆశించిన కలయికకు వీలు కల్పించనపుడు తన లక్ష్యసాధనకు చేపట్టిన కృషి వృధా అవుతుందే అన్న బాధ ఇబ్బందిపెట్టకా పోదు. తాను తలచినపుడు కాకుండా మరొకరు తలచినపుడు అదే పని చేప ట్టడానికి, అదే బాటలో అడుగులు వేయడానికి వెళ్లవలసి రావడం అయిష్టతతోనే జరుగుతుంది. అందుకే తన స్థానంలో తన ప్రతినిధిని పంపుతానని తప్పించుకోవడానికి వెనుకాడ లేదు తెలంగాణా ముఖ్య మంత్రి , టిఆర్ ఎస్ అధినేత కే.చంద్రశేఖర రావు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఎలాగయినా ఈసారి పడగొట్టాలన్న పట్టుదల అటు మమతా బెనర్జీ, ఇటు కేసీఆర్ బాగా ప్రదర్శిస్తున్నారు. కాబోతే, ఒకే ఎజెండా గనుక కలిసి వ్యూహాన్ని రూపొందించుకుంటే బాగుం డేది. కానీ అప్పుడే కోపగించుకోవడాలు మొదలయ్యాయి. బుధవారం మమతా బెనర్జీ నాయకత్వంలో ఢిల్లీ లో సమావేశం జరగనుంది. దానికి బిజెపి వ్యతిరేక నాయకులంతా పాల్గొంటున్నారు. సమావేశంలో పాల్గొ నాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు. కానీ ఆయన కినుక వహించారు.
ఒక పెద్ద యుద్దానికి సన్నద్దమవుతున్నపుడు మరి వ్యూహ రచనకు కలిసి కట్టుగానే పనిచేయాలి. నేనొకటి తలిస్తే తానొకటి తలిచినట్టుగా వుండకూడదు. నేను అడుగు ముందుకు వేసినపుడు ఉత్సాహపరచలేదు గదా? ఇపుడు వారి పిలుపును అందిపుచ్చుకుని రంగంలోకి దిగాలంటే ఎలా? అని బహుశా కేసీఆర్ ఇగో దెబ్బతిని వుండవచ్చన్నది విశ్లేషకుల మాట.
ఆమధ్య కేసీఆర్ దృఢ నిశ్చయంతో నడుం బిగించి ఉత్తరాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ముఖ్యంగా బిజె పీని గట్టిగా వ్యతిరేకించేవారిని కలిసి మనమంతా ఒక్క తాటి మీద నడిస్తే, ఒక పథంలో ముందడుగు వేస్తే కేంద్రాన్ని భయ పెట్టవచ్చుని ప్రచారం చేసేరు. అందుకు బయలుదేరి వెళ్లేరు. ఆ మధ్య సమా జ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్‌ని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ సమావేశమయ్యారు. బిజెపికి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసి మోదీ ప్రభు త్వం మీద యుద్ధం చేయాలని ఎంతో ఆశించారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయన ప్రయత్నాలు ఫలించ లేదు. కేసీఆర్‌కు వారి నుంచి ఆశించిన మద్దతు లభించకపోవ డంతో తిరుగు ముఖం పట్టారు. ఆయనకు ఊహించని అవమానభారం మిగిలింది. అయితే కేసీఆర్ ఏ మాత్రం కుంగిపోలేదు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టి అందరికీ షాక్ ఇద్దామన్న ఆలోచనలో వున్నారు.
ఇదిలా వుండగా, బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు ఆలోచనను ముందుకు తీసికెళ్లడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపి వ్యతిరేక పార్టీల నాయకులకు పిలుపునిచ్చింది. కేసీఆర్ కి ఈ ఆహ్వా నం అంతగా రుచించడం లేదు. తాను స్వయంగా ఎంతో నమ్మకంతో కలిసిపనిచేయడానికి చర్చలకు వెళ్లినపుడు అంతగా స్పందించనివారు ఇపుడు తనను ఆహ్వానించడంలో అర్ధమేమిటని బహుశా కేసీఆర్ అనుకొని వుండవచ్చు. అయితే తన మనసులో భావాన్ని బయటికి వ్యక్తం చేయకుండా తనకి బదులు టి ఆర్ ఎస్ జనరల్ సెక్రటరీ ఎం.పీ కే. కేశవరావు సమావేశంలో పాల్గొంటారని తెలియజేశారు.
కొత్త పార్టీ రూప కల్పన విషయం లో తలమునకలయినందువల్ల తాను దీదీ నిర్వహించే సమావేశానికి రాలేనని కేసీఆర్ తెలియజేశారు. సోమవారం ఉండవల్లి మీడియా సమావేశం కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు విషయాన్ని స్పష్టం చేసింది. పైగా కేసీఆర్ కూడ 19న జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో కొత్త పార్టీ ప్రకటన చేయడానికీ అవకాశం వుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పలువురు ప్రముఖులతో సమావేశం కావచ్చు. అందులో కొత్త పార్టీ ఎజెండా,జెండా, సాంకేతిక అంశాలపై నిపుణల తోనూ కేసీఆర్ చర్చించనున్నారు.