యథా రాహుల్.. తథా జగన్!
posted on Oct 28, 2013 @ 7:04PM
కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్‌గాంధీకి, కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడు జగన్‌ని మధ్య చాలా అంశాలలో పోలికలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పోలిక-1.
రాహుల్ తండ్రి మాజీ ప్రధానమంత్రి. జగన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరి తండ్రులూ కీర్తిశేషులే. ఇద్దరూ తండ్రికి ఏకైక కుమారులే! రాహుల్, జగన్ ఇద్దరూ తమ తండ్రులు అధిష్టించిన పదవులను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారే.
పోలిక-2.
రాహుల్ని ప్రధానమంత్రి చేయాలని ఆయన తల్లి సోనియా పరితపిస్తుంటే, జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తల్లి విజయమ్మ పరిశ్రమిస్తున్నారు.
పోలిక-3.
రాహుల్, జగన్.. ఇద్దర్నీ జనం మూడక్షరాల పేరుతోనే పిలుస్తారు. రాహుల్‌కి ‘యువరాజు’ అనే నిక్‌నేమ్ వుంది. జగన్‌కి ‘యువనేత’ అనే నిక్‌నేమ్ వుంది.
పోలిక-4.
అటు రాహుల్, ఇటు జగన్ ఇద్దరూ ఆవేశపరులుగా, దూకుడు కలిగి వున్నవాళ్ళుగా, తనమాటే నెగ్గాలనే పట్టుదల ఉన్నవారిగా పేరు తెచ్చుకున్నారు.
పోలిక-5.
రాహుల్ గాంధీ కారణంగా దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పోలిక-6.
రాహుల్‌గాంధీలో, జగన్మోహన్‌రెడ్డిలో రాజకీయ అపరిపక్వత కనిపిస్తుంది. ఇద్దరికీ చిన్న వయసులోనే పెద్ద కుర్చీ మీద కన్ను వుంది.
పోలిక-7.
రాహుల్‌కి, జగన్‌కి వేదికల మీద ఎలా మాట్లాడాలో తెలియదు. రాజస్థాన్ ఎన్నిక ప్రచారంలో నోటికొచ్చినట్టు మాట్లాడి రాహుల్ విమర్శలు ఎదుర్కుంటుంటే, సమైక్య శంఖారావంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి జగన్ ఇబ్బందులు తెచ్చుకున్నాడు.
పోలిక-8.
రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. అలాగే జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎటుచూసినా కనిపించడం లేదు.