ఇప్పుడు జగన్‌ని ఇలా చేస్తే ఎలా వుంటుంది?
posted on Jul 12, 2024 @ 3:36PM
అధికారంలో వున్నప్పుడు విర్రవీగిన జగన్, ఆయన తాలూకు దండుపాళ్యం బ్యాచ్ చేయని అక్రమాలు లేవు. ఐదేళ్ళపాటు జగన్ ప్రభుత్వం లెక్కపెట్టడానికి కూడా వీల్లేనన్ని అన్యాయాలు, అక్రమాలు, దారుణాలు చేసింది. అవన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటే బయటపడుతూ కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గుడినా మనం ఐదేళ్ళు భరించింది అని జనం అనుకునేలా అవన్నీ వున్నాయి. సరే, వీటిని అలా వుంచితే, తనను వ్యతిరేకించే వాళ్ళను శారీరకంగా హింసించి ఆనందించే ‘సైకో’తనం జగన్‌లో పుష్కలంగా వుంది. అందుకే పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజుని, చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్టు చేసి వేధించాడు. ఇలా చాలామందిని అరెస్టు చేయించి పోలీసుల చేత చిత్రహింసలకు గురించేయించాడు. ఈ పాపాలన్నిటికీ జనం తగిన శిక్ష విధించారు. జగన్‌ని అధికార పీఠం మీద నుంచి కిందకి లాగి పక్కకి విసిరేశారు. ఇప్పుడు జగన్ తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చింది.
జగన్ ప్రభుత్వం అధికారంలో వున్న సమయంలో తనను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని టీడీపీ ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హింసకు ప్రేరేపించిన జగన్ మీద, దగ్గరుండి హింసించిన పోలీసు అధికారుల మీద కేసు నమోదైంది. ఈ కేసులో జగన్‌ని అరెస్టు చేసి, పోలీసులు చిత్ర హింసలకు గురిచేస్తే ఎలా వుంటుంది? దోమలు కుట్టే సెల్‌లో పడేసి చావగొడితే ఎలా వుంటుంది? వంతులవారీగా పోలీసులను పంపి, బూతులు తిట్టిస్తే ఎలా వుంటుంది? పోలీసులు లాఠీతో కుళ్ళబొడిస్తే ఎలా వుంటుంది? అలా కుళ్ళబొడవటాన్ని ఎవరికైనా లైవ్‌లో చూపిస్తే ఎలా వుంటుంది? అదేంటి? మా జగన్ని చిత్రహింసలకు గురిచేస్తారా... దారుణం.. అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని అరిచేవాళ్ళు చప్పుడు చేయకుండా ఓ పక్కన కూర్చోండి. ఇలాంటి హింసలనే పార్లెమెంటు సభ్యుడు రఘురామరాజుని సాక్షాత్తూ ఇదే జగన్ గురిచేశాడు. జగన్ పాటించిన పద్ధతిని ఆయన మీదే ప్రయోగిస్తే తప్పేముంది? సర్లే, భయపడకండి.. ఇప్పుడున్నది జగన్ లాంటి దుర్మార్గపు పరిపాలన కాదు.. చంద్రబాబు నాయుడి పరిపాలన. ఏది జరిగినా చట్టబద్ధంగానే జరుగుతుంది. అందువల్ల జగన్‌ని లాఠీలతో కుమ్మడం వుండదు!