ఎవరు ఎవరి సంక నాకుతున్నారో చూస్తూనే ఉన్నాం.. రఘురామ రాజు ఫైర్
posted on Oct 7, 2020 @ 6:19PM
గత మూడు రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ పై మరో సారి రెచ్చిపోయారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ముందు నుండి సైలెంట్ అయిన రఘురామ రాజు తాజాగా సొంత పార్టీ నేతల పై దారుణమైన సెటైర్లు వేశారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. "బీజేపీలో తన చేరికపై వైసీపీ నేతలు కొందరు పేలుతున్నారని... అయితే ఎవరు ఎవరి సంక నాకుతున్నారో నిన్న మొన్న మీడియాలో చూశామని" తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "తాము మంత్రులం అయిపోయామని... వైసీపీ నేతలు బుస్సు కబుర్లు చెబుతున్నారని, నవంబరులో కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు వీళ్లు ఇలాగే చెప్పుకుంటారని" అయన అన్నారు. అయితే వీళ్లు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని వచ్చే నెలలో తేలిపోతుందని అయన ఎద్దేవా చేశారు.
"ఇప్పటికే తమకు ఎవరితోనూ జట్టుకట్టే ఉద్దేశం లేదని బీజేపీ స్పష్టంగా చెప్పింది .. కానీ వైసీపీ మాత్రం సొంత ప్రచారం చేసుకుంటోంది. వీళ్లను కేబినెట్‌లోకి రావాలని బతిమాలుతున్నట్టు... అయితే వీళ్ళు మాత్రం ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నట్లు కట్టుకథలు అల్లుతున్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌కు అంత ప్రేమ ఉందా? ప్రత్యేక హోదా కావాలంటే కేబినెట్ నుంచి బయటకు రావాలని... అప్పట్లో టీడీపీని డిమాండ్ చేశారు కదా? హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి. వైసిపి ఎంపీలు కనుక ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే... నేను కూడా వైసీపీకి సహకరించేందుకు సిద్ధం’’ అని అయన అన్నారు.
అయినా దేవాలయాలు నిర్మించే పార్టీ అయిన బీజేపీ... ఆలయాలు కూల్చే వైసీపీతో కలుస్తుందా? అని అయన ఈ సందర్బంగా ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని జగన్... ఇప్పుడు బీజేపీతో కలవాలనుకుంటున్నారా? అని అయన నిలదీశారు. సీఎం జగన్ చెబుతున్నట్టు 20 ఏళ్లు అధికారంలో ఉండాలంటే... అయన నిర్మాణాత్మకంగా వ్యవహరించడం నేర్చుకోవాలని రఘురామరాజు అన్నారు.