గూగుల్ సెర్చ్ లో రాధికా ఆప్టే టాప్ ప్లేస్

 

లెజెండ్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన అందాలతార రాధికా ఆప్టే. సినిమాల పరంగా కాని.. వివాదల పరంగా కానీ మొత్తానికి తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులర్ అయింది. ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పడానికి అసలు మొహమాట పడని ఈ భామ అందాల ఆరబోతలో కూడా అస్సలు మొహమాట పడదు. అందుకే బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా తన సత్తా చాటుకుంటుంది. ఒక్క బాలీవుడ్ లోనే కాదు మరాఠీ భాషల సినిమాల్లో మధ్యలో షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సినీ పరిశ్రమలోనే కాదు గూగుల్ సెర్చ్ లో కూడా రాధికా ముందు వరుసలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. అహల్య అనే 15 నిమిషాల షార్ట్ ఫిలింలో నటించిన రాధికా విచ్చలవిడిగా అందాలను ఆరబోసింది.. దీనికి తోడు తను నగ్నంగా నటించిందంటూ వీడియో క్లిప్ బయటికి పొక్కాయి.. అది కాస్త సద్దుమణిగేలోపే బాత్‌రూమ్‌లో నగ్నంగా సెల్ఫీలు తీసుకొన్నప్పటి ఫొటోలు బయటకువచ్చాయి ఇక చెప్పేదేముంది ఎక్కడ చూసినా రాధిక ఆప్టే గురించే సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో రాధికా అందరిని వెనక్కి నెట్టేసి గూగుల్ సెర్చ్ లో ముందు వరుసలో నిలిచింది. అయితే గూగుల్ సెర్చ్ లో మొదటిస్థానం మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం మొదటిస్థానంలో రావడం విశేషం.

Teluguone gnews banner