అమరావతిని భారత క్వాంటమ్ వ్యాలీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు
posted on Dec 23, 2025 @ 10:50AM
విద్యార్థుల్లో నైపుణ్యం కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. వేలాది టెక్ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ‘క్వాంటమ్ టాక్’ నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు ప్రపంచం మొత్తం క్వాంటం టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఐటీని ప్రమోట్ చేయడంలో తాను విజయం సాధించానని సీఎం తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలను రప్పించాలని చెప్పారు. క్వాంటమ్ టాక్‌లో ఆయన మాట్లాడారు. 1998లో మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు రప్పించామని తెలిపారు. అప్పటో గూగుల్ స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు గూగుల్‌ను తీసుకోచ్చామని తెలిపారు. విశాఖలో చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి ఆ నగరం చిరునామాగా మారబోతోందని తెలిపారు.
25 ఏళ్ల క్రితమే ఐటీ విజన్‌తో విప్లవం తెచ్చామని ఇప్పుడు ప్రపంచ ఐటీ నిపుణుల్లో ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులేనని కొనియాడారు. పురాతన విజ్ఞానం మన డీఎన్‌ఎలోనే ఉందని ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.