పివిఆర్ చేతిలో సినీమాక్స్
posted on Nov 30, 2012 @ 3:17PM
మల్టీ ప్లెక్స్ సంస్థ పివిఆర్ సినీమాక్స్ ను త్వరలో సొంతం చేసుకోనుంది. సినీమాక్స్ కూడా అదే రంగంలోని సంస్థే. సినీమాక్స్ లో దాదాపు 95.27 శాతం వాటాను కొనుగోలు చేయడానికి పివిఆర్ రూ. 543 కోట్లను వెచ్చించాలని భావిస్తోంది.
ఇందులో మొదటి దశగా, సినీ మాక్స్ లోని 69.27 శాతం వాటాను పివిఆర్ 395 కోట్లకు సొంతం చేసుకోనుంది. తన అనుబంద సంస్థ సినీ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా సినీమాక్స్ షేరుకు రూ. 203.65 వెచ్చించి పివిఆర్ కు ఈ వాటాను విక్రయించనుంది.
కాగా, సెబి నిభందనలకు అనుగుణంగా, మరో 26 శాతం వాటాను కూడా పివిఆర్ కొనుగోలు చేయనుంది. ప్రమోటర్ల వాటాను విక్రయించేందుకు పివిఆర్ తో ఒక ఒప్పందానికి వచ్చినట్లు సినీ మాక్స్ బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ కు తెలియచేసింది. అదే విషయాన్ని పివిఆర్ కూడా బీఎస్ఇ కి తెలియచేసింది.
ఈ లావాదేవి ఖరారు అయినట్లు తెలిసిన వెంటనే, బిఎస్ఇ లో పివిఆర్ షేరు 8శాతం, సినీ మాక్స్ షేరు 5 శాతం మేర పుంజుకున్నాయి. ఈ లావాదేవి పూర్తయితే, పివిఆర్ దేశంలోనే అతిపెద్ద మూవీ ఎగ్జిబిషన్ సంస్థగా ఆవిర్భవిస్తుందని పివిఆర్ అధినేత అజయ్ బిజ్లీ ప్రకటించారు.