పీవీ సింధు విన్.. సొనియా జోడీ అవుట్
posted on Jul 25, 2021 @ 11:02AM
టొక్సో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం చేసింది. గ్రూప్-జే తొలి మ్యాచ్‌లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై సునాయసనంగా గెలిచింది. వరుస సెట్లలో 21-7, 21-10 తేడాతో సింధు ఘన విజయం సాధించింది. సూపర్ ఫామ్ కొనసాగించిన సింధు.. కేవలం 28 నిమిషాల వ్యవధిలోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. తన తరువాతి మ్యాచ్‌లో సింధు హాంగ్‌కాంగ్‌కు చెందిన చెయుంగ్ గాన్‌తో తలపడనుంది.
ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు నిరాశపరిచారు. మనుబాకర్, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్ 575 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితం కాగా, యశస్విని 574 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. చివరి షూటర్ 577 పాయింట్లతో ఫైనల్స్‌కు అర్హత సాధించారు. దీంతో రెండు పాయింట్ల తేడాతో మనుబాకర్ ఫైనల్‌కు వెళ్లలేకపోయారు.
ఒలింపిక్స్ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో హైదరాబాదీ ,మాజీ ఒలింపియన్ సానియా మిర్జా జోడి తొలి రౌండ్ లోనే నిష్క్రమించింది. ఉక్రెయిన్‌కు చెందిన కవలలు లియుడ్మిలా కిచెనోక్, నదియా కిచెనోక్.. సానియా మిర్జా, అంకితా రైనా జోడిని ఓడించారు. భారత్‌పై ఉక్రెయిన్ 6-0, 6-7, 8-10 తేడాతో గెలిచింది. తొలి సెట్ ను బాగా సోనియా మీర్జా జోడి.. ఆ తర్వాత ఏ మాత్రం రాణించలేకపోయారు. తొలి సెట్‌ను 6-0తో కైవసం చేసుకోగా, అనంతరం రెండు సెట్లలో ఓడిపోయారు. మొదట సానియా జోడి రెండో సెట్‌లో 5-3 తేడాతో లీడ్‌లో కొనసాగింది. ఆ తర్వాత మాత్రం ఉక్రెయిన్ క్రీడాకారిణులపై సానియా జోడి పైచేయి సాధించలేకపోయింది.