ఆషాడం వస్తే చాలు..పూరీలో రథ యాత్ర ప్రారంభం

 

పూరి జగన్నాథ ఆలయం. అంతుచిక్కని రహస్యాల గని. ఈ ఆలయంపై ఏ సమయంలోనూ నీడ పడక పోవడం ఒక ప్రాకృతిక విచిత్రి. కాగా.. ఆలయ పై భాగంలో ఉన్న ఇరవై అడుగుల సుదర్శన చక్రం పూరీలోని ఏ ప్రాంతం నుంచి చూసినా కనిపించే దిక్సూచి. ఆలయ శిఖరంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడమొక దైవలీలగా ప్రసిద్ధి. ఆలయంలోపలికి ప్రవేశించిన తర్వాత సముద్రపు ఘోష వినిపించకపోవడం మరో విశేషం. ఇక ఆలయంలో వండే ప్రసాదం ఎంత మందికి వండినా ఎప్పుడూ వృధా కాక పోవడం మరో అంతుచిక్కని రహస్యం. ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర జగత్ ప్రసిద్ధం. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళా ఖాతం తీరాన వెలసిన అత్యంత పురాతన ఆలయం పూరీ జగన్నాథ ఆలయం. హిందువులు తప్పక సందర్శించాల్సిన దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. చార్ ధామ్ ఆలయాల్లోనే సుప్రసిద్ధం. 

ఈ ఆలయం ఇటు ఇతిహాస అటు చారిత్రక విశేషాల సమాహారం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం కళింగ పాలకుడైన చోడగంగాదేవ నిర్మించినదిగా చెబుతుంది ఆలయ చరిత్ర. అంతే కాదు ఈ ఆలయ నిర్మాణంలో అనంగభీమదేవ పాత్ర కూడా ఉంది. తర్వాతి కాలంలో రామచంద్ర దేవ విగ్రహ పునఃప్రతిష్ట చేసినట్టుగానూ చెబుతోంది స్థల చరిత్ర.

అయితే జగన్నాథుడి విగ్రహాలు ఒక పూర్ణ రూపంలో గాక.. విచిత్రాకారంలో ఉంటాయి కారణమేంటన్నది అంతుచిక్కని ప్రశ్న. అయితే ఇందుకంటూ కొన్నికథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్వతహాగా.. ఇక్కడి జగన్నాథుడిని స్థానిక గిరిజనుల దేవుడనీ, నీల మాధవుడనీ నమ్ముతారు. అడవిలో ఒక రహస్య ప్రాంతంలో గిరిజన రాజు విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే ఒక యువకుడ్ని పంపుతాడట. అయితే అతడు విశ్వావసు కుమార్తెను ప్రేమించి పెళ్లాడుతాడట. తన వివాహానంతరం.. జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే విద్యాపతి అడగ్గా.. అతడి మామగారైన విశ్వావసుడు కళ్లకు గంతలు కట్టి.. ఆ ప్రాంతానికి తీస్కెళ్తాడట. ఆ దారి గుండా ఆవాలు ఆనవాళ్లుగా చల్లిన విద్యాపతి.. ఎట్టకేలకు రాజుకు కబురు పెడతాడట. అయితే రాజు ఆ ఆనవాళ్ల ద్వారా అక్కడకు చేరుకోగానే విగ్రహాలు కనిపించవట. 

తిరిగి రాజ్యానికి చేరిన రాజు కలలో జగన్నాథుడు కనిపించి.. సముద్ర తీరానికి వేపకొయ్యలు కొట్టుకొస్తాయని.. వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడట. కొయ్యలు కొట్టుకొస్తాయి కానీ విగ్రహం చేయడమెలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే విశ్వకర్మ.. ఒక వికలాంగుడి రూపంలో వచ్చి తానీ కార్యం నెరవేర్చుతానని అంటాడట. అయితే.. 21 రోజుల పాటు తాను నిద్రాహారాలు లేకుండా ఈ విగ్రహాలు చెక్కుతాననీ.. ఎవరూ ఈ పరిసరాలకు రాకూడదని షరతు విధిస్తాడట. ఎన్నాళ్లయినా విగ్రహ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రాణి గుడించా దేవి.. తొందర పెట్టడంతో.. గడువు తీరకుండానే తలుపులు తెరుస్తారట. అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కీ చెక్కని శిల్పాలుంటాయి. దీంతో బ్రహ్మదేవుడ్ని ప్రార్ధిస్తాడా రాజు. అయితే అదే రూపంలో ఇక్కడ విగ్రహాలు పూజలందుకునేలా ఆనతిస్తాడా చతుర్ముఖుడు. తానే వాటికి ప్రాణప్రతిష్ట చేస్తాడు. అందుకే ఇక్కడి విగ్రహాలకు అభయ హస్తం, వరద హస్తం కనిపించదని అంటారు. అయితే 14 లోకాలను వీక్షించడానికి చారడేసి కళ్లతో ఇక్కడి విగ్రహాలుంటాయని అంటారు.

ఇక దేవాలయానికి సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం.. పూరీ సముద్ర తీరంలోని ఒక మర్రి చెట్టు దగ్గర.. ఇంద్రనీల ఆభరణంగా అవతరించాడట ఆ జగన్నాథుడు. అయితే ఈ నీలి ఆభరణం చూడగానే తక్షణ మోక్షం లభిస్తుందట. దీంతో యమధర్మరాజు ఈ ఆభరణాన్ని భూమిలో పాతి పెడతాడట. ద్వాపరయుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు.. అంతు చిక్కని ఆ రూపం గురించి తెలుసుకోవాలని చెప్పి.. ఘోర తపస్సు చేశాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై పూరీ సముద్ర తీరానికి వెళ్లి.. అక్కడే తేలియాడే చెట్టు దుంగను కనుక్కని దాని కాండలోంచి తనకు రూపు తయారు చేసుకురమ్మని అతడ్ని ఆజ్ఞాపించాడట. ఈ కార్యం నిర్విఘ్నంగా నిర్వహించిన రాజు విగ్రహాలను ఎలా చేయాలో అర్ధం కాక యజ్ఞం  చేశాడట. యజ్ఞ నారసింహరాజు ప్రత్యక్షమై నారాయణుడ్ని నాలుగు అక్షరాల్లో విశదీకరించమనడంతో.. అవి జగన్నాథ- బలరామ- సుభద్ర- సుదర్శన చక్రాలైతే బావుంటాయని భావించారట. విశ్వకర్మ చిత్రకారుడి రూపంలో వచ్చి ఈ విగ్రహాలను చెక్కి వెళ్లాడట.

ఈ ఆలయం కొన్ని తరాలుగా హిందూ- ఆదివాసీ సంస్కృతుల మేలు కలయికగా వస్తోంది. ఈ మూడు విగ్రహాలు జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యం పొందాయి. ఇవి మోక్ష మార్గాలుగా అంతులేని ఆనంద ప్రదాతలుగా పిలవబడుతున్నాయని నమ్ముతారు.

ఇక్కడి జగన్నాథుడు నారాయణుడిగా, బలభద్రుడు ఆదిశేషువుగా అదే సమయంలో ఆలయంలోని విగ్రహాలు భైరవ, విమలగానూ పూజలందుకుంటున్నాయి. అందుకే ఇది శైవ వైష్ణవ క్షేత్రాల్లోనే సుప్రసిద్ధమైనదిగా భావిస్తుంటారు. అంతే కాదు ఇటు శైవ అటు వైష్ణవతో పాటు శక్తిత్వానికీ ఈ ఆలయం ఒక ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం 4 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో చుట్టూ ప్రహరీ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంటుంది. ఇందులో 120 గుడులు ఇతర పూజనీయ స్థలాలున్నాయి. ఒడిశా నిర్మాశైలికి చెందిన ఈ ఆలయం భారతీయ అద్భుత నిర్మాణాలలో ఒకటి. 

ఇక ఎనిమిది ఆకులతో నిర్మితమైన నీలచక్ర- శ్రీ చక్రం అష్టధాతువులతో తయారైనదిగా నమ్ముతారు. ఎత్తైన రాతి దిమ్మపైగల ధ్వజస్థంభం గర్భగుడికన్నా 214 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టపక్కల పరిసరాల్లో అతి పెద్దదిగా దర్శనమిస్తుంది. చుట్టూ ఒక పర్వత శ్రేణి ఉన్నట్టు కనిపిస్తుంది. సింహద్వారం సంగతి సరేసరి. రెండు వైపులా గాండ్రించే సింహాలతో అత్యంత గంభీరంగా ఉంటుంది. ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలుండగా.. ఉత్తర, పడమట, దక్షిణ దిక్కులలో హథిద్వారా అంటే ఏనుగు, వ్యాగ్ర ద్వారా అంటే పులి, అశ్వద్వారా అంటే గుర్రాల ద్వారాలుగా ఇవి కనిపిస్తాయి.

గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ, బలభద్ర, సుభద్రల మూల విరాట్టులు రత్నవేది ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి. కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మారుస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచీ ఉంది. అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచీ ఉందని చెబుతారు.

ఇక్కడ మండపాలు ఇతరత్రా ఎన్నో ఆలయాలతో ఎంతో పవిత్రత తొణికిసలాడుతుంది. ఇక ఆలయ వంట శాల ఇక్కడి మహాప్రసాదం ఏ ఫైవ్ స్టార్ ఫుడ్ కి తీసి పోనంత నాణ్యంగా ఉండటమే కాదు. ఆ రుచికి ప్రత్యేకమైన జియోగ్రాఫికల్ గుర్తింపు ఉంది. ఇక్కడి వంటకాలు ఎంతో రుచిగా శుచిగా ఎందుకు ఉంటాయని చూస్తే.. ఈ వంటశాల మహాలక్ష్మీదేవి పర్యవేక్షణలో సాగుతుందని విశ్వసిస్తారు. ఇక్కడి వంటకు కేవలం మట్టి పాత్రలను మాత్రమే వినియోగించడం మరో ప్రత్యేకత. వంటశాలకు దగ్గరగా ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నీటిని మాత్రమే వాడుతారు. మొత్తం 56 నైవేద్యాలను వండుతారు. ఈ నైవేద్యం జగన్నాథునికి సమర్పించిన తర్వాత మహా ప్రసాదంగా ఈశాన్యంలోని ఆనంద బజార్ లో పంచుతారు. ఇక్కడి భక్తులు ఈ మహాప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

ఇక్కడి ప్రధానమైన పండుగలేంటని చూస్తే.. జూన్ లో జరిగే రథయాత్ర. ఈ బ్రహ్మాండమైన పండగలో జగన్నాథ, బలరామ, సుభద్రల విగ్రహాలున్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు. ఏడాదిలో రెండు ఆషాడ మాసాలు వచ్చినపుడు నబకలేవర ఉత్సవం పేరిట.. కొత్త విగ్రహాలను మార్చుతారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున చందన యాత్ర రథ నిర్మాణ ప్రారంభాన్ని సూచిస్తుంది. జేష్ట పౌర్ణమిరోజున అన్ని ప్రతిమలకు స్నానం చేసి అలంకరిస్తారు. వసంతకాలంలో డోలాయాత్ర, వర్షాకాంలో ఝులన్ యాత్ర వంటి పండగలు నిర్వహిస్తారు. కార్తీక, పుష్యమాసాలలో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. ఇక విమలాదేవి కోసం  ఆశ్వయుజ మాసంలో షోడశ దినాత్మక పూజ ఘనంగా నిర్వహిస్తారు. ఇక బ్రహ్మపరివర్తన వేడుక సైతం గొప్పగా జరుగుతుంది. 

జేష్ట పౌర్ణమినాడు స్నాన యాత్ర తర్వాత జగన్నాథ- బలభద్ర- సుభద్ర- సుదర్శన విగ్రహాలను రహస్య మందిరాలకు తీస్కెళ్తారు. అక్కడ కృష్ణపక్షం వరకూ ఉంచుతారు. ఆ సమయంలో భక్తులకు జగన్నాథ దర్శనానికి వీలు పడదు. అప్పుడు బ్రహ్మగిరిలోని విష్ణువు స్వరూపమైన అల్వర్నాత్ ని కొలుస్తారు. అధిక స్నానం చేయడంతో దేవుళ్లకు జ్వరం చేసిందని.. పదిహేను రోజుల పాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథ మహిమాన్విత చరితం. నిరంతర పారాయణం.

ఒడిశాలోని పూరీకి ఎలా చేరుకోవాలో చూస్తే.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి. భువనేశ్వర్ బీజూపట్నాయక్ ఎయిర్ పోర్ట్ పూరీకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన నగరాల నుంచి రైలు సర్వీసులు విస్తృతంగా ఉన్నాయి. కోల్ కతా- చైన్నై ప్రధాన రైలు మార్గం కావంతో .. ఖుర్దారోడ్ రైల్వే స్టేషన్లో దిగి.. అక్కడి నుంచి పూరీకి టాక్సీల్లో చేరుకోవచ్చు. ఈ స్టేషన్ పూరీకి కేవలం 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్, కోల్ కతా, విశాఖ నుంచి బస్సు సౌకర్యం ఉంది.

కూటమిలో పవన్ సొంత అజెండా?

అమరావతి వేదికగా తాజాగా  జరిగిన రెండు సమావేశాలు.. రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఓ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగితే.. మరో సమావేశం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగింది. అదేంటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఉపముఖ్యమంత్రి, ఐదు శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరవ్వాలి కదా? పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? అనే  అనుమానాలు మీకు కలగవచ్చు... మీకే కాదు.. కూటమిలో ఉన్న నేతలతో పాటు రాజకీయ నాయకులకు ఇదే అనుమానం కలుగుతోంది.  అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అన్ని శాఖల హెచ్‌ఓడీలు, కార్యదర్శులు , మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో  సమావేశం నిర్వహించారు.  ఈనెల 17, 18 తేదీల్లో జరగబోతున్న కలెక్టర్స్ కాన్ఫిరెన్స్ కి కర్టెన్ రైజర్ గా జరిగింది ఈ సమావేశం. పరిపాలకు సంబంధించినటు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇలాంటి కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ  రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్  కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి  సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.  వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎన్డీఏలో అత్యంత యాక్టివ్‌గా కనిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వేగంగా విస్తరిస్తోంది. మొదటి రోజుల్లో జరిగిన ప్రతి ముఖ్య సమావేశానికి స్వయంగా హాజరై, ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందున్న జనసేనాని, ఇటీవల మాత్రం కీలక అధికారిక ఈవెంట్స్‌కి కూడా హాజరుకాకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ముఖ్య మీటింగ్‌లకు కూడా పవన్ డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అమరావతిలోనే ఉన్నప్పటికీ...సీఎం చేపట్టే అత్యావశ్యక కార్యక్రమాలకు వెళ్లకుండా, ఆయన సొంత షెడ్యూల్‌ని ఫాలో అవుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఎస్ఐబీపీ సమావేశాలు, విశాఖ ఇండస్ట్రియల్ సమ్మిట్, సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం, రాజధాని ప్రాజెక్టుల రివ్యూ, పెన్షన్ల పంపిణీ వంటి ప్రభుత్వ ముఖ్య వేడుకలు, మీటింగ్‌లు, లాంచింగ్‌లు.. వీటి వేటిలోనూ  పవన్ కనిపించకపోవడం చిన్న విషయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి భాగస్వామ్యంలో ఇలాంటి గ్యాప్… ముఖ్య కార్యక్రమాల్లో పవన్ కనిపించకపోవడం… సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అన్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందంటున్నారు.  అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా చేస్తున్నారా? లేక ముందస్తుగానే షెడ్యూల్ అయిన కారణంగానే  సీఎం సమావేశానికి హాజరు కాలేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుంది. అంతే కాదు  పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పాలనలో తన ఇమేజ్‌ని పెంచుకోవాలని భావిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక పార్టీ అధినేతగా  విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం ద్వారా.. దాని ఇంపాక్ట్ క్యాడర్ మీద కూడా పడే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూటమి సభల్లో  మూడు పార్టీల కార్యకర్తలు కలిసి ఉండాలని, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని... కార్యకర్తలు, నేతల ప్రవర్తన కారణంగా కూటమి ఐక్యతను దెబ్బతీయొద్దంటూ  పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్.... ఆచరణలో తాను స్వయంగా ఎందుకు ఫాలో కావట్లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణాలు ఏమైనా గానీ.. పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం.. కూటమి కలిసి చేస్తున్న  కార్యక్రమాలకు హాజరు కాకపోవడం వల్ల నెగిటివ్ టాక్ స్ప్రెడ్  అవుతుందనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ వినపడుతోంది. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కీలకమైన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎంగా  ఉన్న మల్లు భట్టి విక్రమార్క  కచ్చితంగా పాల్గొంటున్నారు.. కర్ణాటకలోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి సమావేశాలకు, కూటమి నిర్వహించే సమావేశాలకు పవన్ దూరంగా ఉండడం వెనుక  మతలబు ఏంటో జనసేన నాయకులే చెప్పాలంటున్నారు. మొత్తానికి తాజాగా జరిగిన హెచ్ఓడీలు, సెక్రటరీల సమావేశానికి పవన్ రాకపోవడం.. అమరావతి లోనే  తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం వెనుక మతలబు ఏంటనే దానిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.

రెండో విడత పంచాయతీ పోలింగ్ షురూ

తెలంగాణలో  రెండో విడత పంచాయతీలకు పోలింగ్‌  ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది ఆ తరువాత  ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. రెండో విడతలో భాగంగా 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా  ఐదు పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో రెండు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. ఇక పోతే 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను  108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.   31 జిల్లాల్లో మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 27,96,006 పురుషులు, 29,26,306 మంది మహిళలు,   153 మంది ఇతరులు ఉన్నారు. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేశారు.   

ఈటల రాజేందర్ మళ్లీ హర్టయ్యారు!.. ఈ సారి బీజేపీతో తాడో పేడో?

ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా... ఆ పార్టీలో ఆయన ఒంటరే అని చెప్పాలి. అసలు ఈటల బీజేపీలో చేరడమే ఆశ్చర్యమంటారు ఆయన గురించి తెలిసిన వారు. సరే రాజకీయ అనివార్యతతో ఆయన బీజేపీ పంచన చేరినా పదే పదే అవమానాలకు గురైతున్నారు. ఉక్కపోతను తట్టుకుంటూ నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ సాధన ఉద్యమం నుంచి, రాష్ట్ర ఆవిర్భావం వరకూ, ఆ తరువాత ఐదేళ్ల పాటు మంత్రిగా ఈటల తెలంగాణ ప్రగతిలో కేసీఆర్ తో సమానమైన స్థాయిలో పని చేశారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఈ విషయం వాస్తవం.  2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగిన తరువాత   తెలంగాణ ప్రగతిలో, సంక్షేమంలో ఈటల ముద్ర చెరిపివేయడం సాధ్యం కాదనీ బీఆర్ఎస్ వర్గాలే చెబుతాయి.  రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈటల బడ్జెట్ కేటాయింపులు హేతుబద్ధంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేవని బీఆర్ఎస్ వర్గాలే కాదు.. ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా అప్పట్లో ప్రశంసలు కురిపించారు. వామపక్ష భావజాలంతో ఉ:డే ఈటల.. తన శాఖకు సంబంధించినంత వరకూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వారనీ, అదే కేసీఆర్ కు నచ్చలేదనీ అనే వారు బీఆర్ఎస్ లో ఇప్పటికీ ఉన్నారు.  సరే 2014 ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపిన క్రెడిట్ కేసీఆర్ ఖాతాలోనే పడినా.. తెలంగాణ ప్రగతిలో కొంత క్రెడిట్ ఈటల ఖాతాలోనూ పడింది. అదే ఆయనకు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కారణమైందని అంటారు.  2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విజ యం సాధించి కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత ఈటలను ఆయన దూరం పెట్టారు.   కేబినెట్ లో ఇవ్వలేదు. అయితే . ఆ తరువాత విస్తరణ సమయంలో అనివార్యంలో ఈటలను కేబినెట్ లోకి తీసుకున్నప్పటికీ,  భూ కబ్జా ఆరోపణలతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు .దీంతో పొమ్మన లేక పొగబెడుతున్నారని గ్రహించిన ఈటల ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు.  వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీ గూటికి చేరడమేమిటన్న విస్మయం అప్పట్లో సర్వత్రా వ్యక్తమైంది.  ఇది జరిగిన కొన్నాళ్లకే ఈటల తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు.  అధికార బీఆర్ఎస్ ఎన్ని విధాలుగా ఈటల విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం సాధించలేకపోయి చతికిల పడింది. నియోజకవర్గంలో  బీసీలలో తనకున్న పట్టును ఈటల హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో  23, 855 ఓట్ల మెజారిటీతో  గెలవడం ద్వారా నిరూపించుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఆ ఉప ఎన్నికలో విజయం సాధించినా.. ఈ గెలుపు మాత్రం పూర్తిగా ఈటల వ్యక్తిగత ఖాతాలోనే పడింది. అయితే తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.   పంచాయతీ ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో   బండి సంజయ్ అనుచరులు ఎక్కువ మంది బీజేపీ మద్దతుదారులుగా బరిలో నిలబడ్డారు.  సరే ఈటల రాజేందర్ వర్గీయులు కూడా   బీజేపీ మద్దతుదారులుగా పోటీలో నిలిచారు. అయితే  సర్పంచులుగా గెలిచిన వారు బండి సంజయ్ మద్దతుదారులే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పీఆర్వో సోషల్ మీడియా వేదికగా  ఈటల వర్గీయుల ఓటమిని ప్రస్తావిస్తూ, వారెవరికీ బీజేపీ మద్దతు ఇవ్వలేదు, ఈటల స్వయంగా వారిని నిలబెట్టారన్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. శనివారం (డిసెంబర్ 12) మీడియాతో మాట్లాడిన ఆయన   ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో, ఉండాలో ప్రజలే తేల్చుకుంటారనీ, కాలమే అన్నీ నిర్ణయిస్తుందని అన్నారు.  పంచాయతీ ఎన్నికలలో మిగిలిన రెండు విడతలూ పూర్తయిన తరువాత అన్ని విషయాలూ వివరంగా చెబుతానన్న ఈటల ఈ సారి పార్టీతో తాడో పేడో తేల్చుకోవడానికే రెడీ అయ్యారని ఆయన అనుచరులు అంటున్నారు.  

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. మరి కొద్ది సేపటిలో పోలింగ్

తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నది. . ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలౌతుంది. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. 415 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మరో 5 చోట్ల నామినేషన్లు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ఏకగ్రీవాలు కాకుండా.. మిగిలిన 3,911 పంచాయతీలకు సర్పంచులు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే..  రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.  కాగా తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల హవా సాగింది. మొత్తం 3834 సంర్పంచ్ స్థానాలకు, 27 వేల 628 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక 398 పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. పోలింగ్ జరిగిన పంచాయతీల్లో 37 వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే 3451 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేశారు. మొత్తం 52, 57 277 మంది ఓటర్లకుగాను 45, 15, 141 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంటే 84.28శాతం ఓటింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 92. 88 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడత ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరువాత రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థలు ఉండగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు, స్వతంత్రులు కూడా విజయం సాధించిన వారిలో ఉన్నారు. 

టీడీపీలో చేరిన వైసీపీ నెల్లూరు నేత కరిముల్లా

  నెల్లూరు జిల్లాలో వైసీపీకి  బిగ్ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. 42 వార్డు వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు. మంత్రి నారాయణ సమక్షంలో కరీముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరికతో మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పరువు పోగొట్టుకున్నట్లైంది. కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో మాజీ సీఎం జగన్‌ పరువుకు భంగం వాటిల్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. శనివారం (ఈ నెల 13)ఉదయం కరీముల్లాను స్వయంగా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ వెంటబెట్టుకుని అమరావతికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయవాడలో కరీముల్లాకు మంత్రి నారాయణ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరినీ టీడీపీలోకి తీసుకెళ్లేందుకు ముక్కాల ద్వారకానాధ్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  

నెల్లూరు నెంబ‌ర్ గేమ్

  నెల్లూరు మేయ‌ర్ పై అవిశ్వాసం  పెట్టింది టీడీపీ. ఈ నెల  ప‌ద‌హారున ఈ అవిశ్వాస  తీర్మానం  జ‌రుగుతుండ‌టంతో.. అటు వారు ఇటు- ఇటు వారు అటు అనే నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.. ఇప్ప‌టి  వ‌ర‌కూ ఉన్న వారెంత‌?  లేని వారెంద‌రు? ఎవ‌రి  బ‌లాబ‌లాలేంటి? అన్న‌ది  ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క‌లు మారుతూనేఉన్నాయి. సంద‌ట్లో స‌డేమియాలా కొంద‌రు కార్పొరేట‌ర్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుతూనే ఉన్నారు. ప్ర‌స్తుతం టీడీపీలోకి వెళ్లిన  ఐదుగురు వైసీపీ కార్పొరేట‌ర్లు ఇటు తిరిగి ఇటు వ‌చ్చేశారు. వీరిలో ఒక ఇద్ద‌ర్నిత‌మ పార్టీ అధినేత జ‌గన్ ముందు తీస్కెళ్లి  ప్ర‌వేశ పెట్టారు మాజీ మంత్రి అనిల్, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ ప‌ర్వ‌త‌రెడ్డి. దీంతో గ‌ణాంకాల్లో తేడా వ‌చ్చింది. మ‌రో ఇద్ద‌రుగానీ టీడీపీని వీడిపోతే.. అవిశ్వాస‌మేవీగిపోతుంది. కానీ ఇక్క‌డే టీడీపీ మేజిక్ చేయ‌గ‌లిగింది.. జ‌గ‌న్ ని క‌లిసిన ఆ ఇద్ద‌రూ తిరిగి టీడీపీలోకి వ‌చ్చేసిన‌ట్టు వారే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు. ఇంత‌కీ నెల్లూరు మేయ‌ర్ వ్య‌వ‌హారంలో అస‌లేం జ‌రిగిందో చూస్తే..  నెల్లూరు మేయ‌ర్ పొట్లూరి స్ర‌వంతిపై అవిశ్వాస  తీర్మానం ఎందుకు పెట్టారో చూస్తే.. నాలుగేళ్ల క్రితం  నెల్లూరు కార్పొరేష‌న్లో 54 డివిజ‌న్ల‌ను వైసీపీసొంతం చేసుకుంది. ఈ పార్టీకి  చెందిన రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి  శ్రీధ‌ర్ రెడ్డి కూట‌మిలోకి వ‌చ్చారు. దీంతో కొంద‌రు కార్పొరేట‌ర్లు శ్రీధ‌ర్ రెడ్డి  వెంబ‌డి న‌డిచారు. దీంతో మేయ‌ర్ భ‌ర్త జ‌య‌వ‌ర్ధ‌న్ షాడో మేయ‌ర్ గా అధికారం చ‌లాయించాడు. అక్ర‌మాలు చేసి  ఫోర్జ‌రీ  కేసుల్లో జైలుకు వెళ్లాడు. దీంతో నెల్లూరు న‌యా అభివృద్ధి కోసం  కొత్త  పాల‌క వ‌ర్గాన్ని  ఎంపిక చేసేందుకు 42 మంది కార్పొరేట‌ర్లు సిద్ధ‌ప‌డ్డారు. మంత్రి నారాయ‌ణ‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని క‌లిసి  క‌లెక్ట‌ర్ అనుమ‌తి  పొందారు. చివ‌రికి అవిశ్వాస  తీర్మానం కోసం  రంగం సిద్ధ‌మైంది. ఈ ప‌రిస్థితుల్లో క్వార్జ్  అక్ర‌మాల విచార‌ణ‌లో ఉన్న జిల్లా నేత‌లు, వారికి అండ‌గా ఉన్న గంజాయి బ్యాచ్ కార్పొరేట‌ర్ల‌ను ప్ర‌లోభ  పెట్ట‌డం  ప్రారంభించారు. ఫోన్ల ద్వారా బెదిరింపులు చేయ‌డం ప్రారంభించారు. టీడీపీ లోకి వ‌చ్చిన వారిని బెదిరించ‌డంతో పాటు ప్ర‌లోభాలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యం మంత్రి నారాయ‌ణ ఎమ్మెల్యే  కోమ‌టిరెడ్డి దృష్టికి వెళ్ల‌డంతో.. వారీ విష‌యం సీరియ‌స్ గా తీస్కున్నారు. బెదిరింపుల‌కు పాల్ప‌డే వారి వివ‌రాలివ్వాల్సిందిగా.. కోరారు. వారి డీటైల్స్ పోలీసుల‌కు అందించి క‌ఠిన  చ‌ర్య‌లు తీస్కోవ‌ల్సిందిగా ఆదేశించారు. ఇప్పుడ‌క్క‌డి ప‌రిస్థితి  ఎలా త‌యారైందంటే.. ఇటు వైసీపీ అటు టీడీపీ వ‌ర్గాలు కార్పొరేట‌ర్ల  నివాసాల ముందు నిఘా ఏర్పాటు చేశారు. మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయొద్దని వైసీపీ  చేయ‌ని  ప్ర‌య‌త్నం లేదు. మ‌రికొంద‌రు ఫోన్ల‌లోనే బేర‌సారాలు మొద‌లు పెట్టారు. ఏ కార్పొరేటర్​కి ఫోన్ చేసి బెదిరించినా వెంటనే సమాచారం అందించాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆదేశించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరగనున్న ప‌రిస్థితిలో మేయ‌ర్ ఎన్నిక‌ నగరంలో తీవ్ర‌ చర్చనీయంగా మారింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌన్సిల్ సమావేశం జరిగే వరకు వైసీపీ నేతలు ఎలాంటి ప్ర‌లోభాల‌ ప్రయోగాలు చేస్తారో వేచి చూడాలి. మేయర్​గా ఉన్న పొట్లూరి స్రవంతికి, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది వ‌ర‌కే ప్రకటించారు. ఇక మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఈ విఝ‌యాన్ని గుర్తు చేశారు. అంతే  కాదు త‌మ‌కంత‌టి సంఖ్యాబ‌లం లేదంటూనే లోలోప‌ల లోపాయికారీ బేర సారాలు ఆడుతున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో నెల్లూరు మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారేలా క‌నిపిస్తోంది.

కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌ సంచలనం

  తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే  కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఓ మండల అధ్యక్షుడిని టార్గెట్ చేసి వరుస వాట్సాప్ స్టేటస్‌లు పెట్టి విమర్శలు గుప్పించారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి?  పేకాట క్లబ్ కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్‌కా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే ...నువ్వు నిజంగా రాయల్...అంటూ రాసుకొచ్చారు కొలికపూడి.  విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును ఉద్దేశించి ఈ స్టేటస్‌లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట ఆడిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించినట్లు తెలుస్తోంది.  రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గమని ప్రచారం జరుగుతోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ల పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు.  

ఆ గుంట నక్కలకు చెప్తున్న తోలు తీస్తా...కవిత వార్నింగ్

  పందెం కోళ్ల కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బినామీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు? ఇవన్నీ నాకు తెల్వదా? ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటున్నారేమో ఒక్కొక్కడి తోలు తీస్తాని కవిత హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.  తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తుందని నన్ను అంటున్నారు. అలా మాట్లాడే గుంటనక్కలకు చెప్తున్నా. నా మీద అనవసరమైన  దాడి చేస్తే మీ చిట్టా మోత్తం విప్పుతాని కవిత అన్నారు.  జనం బాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి,అక్రమాలు అన్నీ బయటికి వస్తున్నాయి. ఇది జస్ట్ టాస్ మాత్రమే. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఏదో ఒక రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అవినీతిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. నాకు సమయం వస్తుంది. ఏదో ఒకరోజు సీఎం అవుతాను...2014 నుంచి ఇప్పుటి వరకు రాష్ట్రంలో జరిగిన స్కామ్‌లపై చర్యలు తీసుకుంటానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు

95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా గెలిచిన ఎమ్మెల్యే తండ్రి

  తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి  ఘన విజయం సాధించారు. సూర్యపేట జిల్లా  తుంగతుర్తి నియోజకవర్గం నాగారం గ్రామం పంచాయతీ నుంచి సర్పంచ్‌గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో ప్రత్యర్థి మీద విజయం సాధించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బీఆర్ఎస్  అధినేత కేసీఆర్ అభినందించారు.  100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం, అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం అని కేసీఆర్ అన్నారు.   సంతోషం వ్యక్తం చేస్తూ,ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను,  మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను అధినేత కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని అధినేత అభిలషించారు. మొదటి విడత ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో గెలుపు పోందారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో హస్తం పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. బీజేపీ మద్దతుదారులు రెండువందల లోపు స్థానాలకు పరిమితమైంది.తొలివిడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 3,834 సర్పంచి, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 84.28 శాతం ఓటింగ్‌ నమోదైంది

జ‌గ‌న్ స‌ర్వేలో బ‌య‌ట ప‌డ్డ నిజాలేంటి?

  తాజాగా కోటి  సంత‌కాల సేక‌ర‌ణ  చేసింది వైసీపీ. జ‌గ‌న్ పాల‌నికిదో రెఫ‌రెండంగానూ చెప్పుకొస్తున్నారు భూమ‌న‌, రోజా వంటి వైసీపీ  జ‌గ‌జ్జంత్రీలు. ఇదంతా ఇలా ఉంటే  ఈ పైపై మెరుగుల‌కు మోస  పోని... జ‌గ‌న్ లోలోప‌ల ఒక భారీ స‌ర్వే చేయించార‌ట‌. ఈ స‌ర్వేలో 18 నెల‌ల కూట‌మిపాల‌న ఎలా ఉందో ఒక తుల‌నాత్మ‌క ప‌రిశీల‌న చేయించార‌ట‌. ఈ ప‌రిశీల‌న‌లో తేలిన వాస్త‌వాలేంటో చూస్తే..  గ‌తంలో క‌న్నా ఎంతో మెరుగ్గా  కూట‌మి  పాల‌న ఉన్న‌ట్టు చెప్పార‌ట ఈ స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. త‌మ‌కు అన్నీ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని.. ఫించ‌న్లు స్వ‌యంగా బాబే ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మ‌నీ.. గూగుల్ వంటి సంస్థ‌లు రావ‌డంతో పాటు.. ఇటీవ‌ల పార్ట‌న‌ర్ స‌మ్మిట్ ద్వారా 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర పెట్టుబ‌డుల‌కు సంబంధించిన ఒప్పందాలు జ‌రిగాయ‌ని.. ఇక సంక్షేమ‌ప‌థ‌కాలు కూడా పెద్ద ఎత్తున జ‌నానికి చేరుతున్నాయ‌నీ చెప్పార‌ట‌. మ‌రి  ప‌వ‌న్ క‌ళ్యాణ్ 15 ఏళ్ల పాటు ఈ కూట‌మి క‌లిసి  ఉండాల‌ని కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయ‌మేంట‌ని అడ‌గ్గా.. అలా ఉంటేనే రాజ‌ధానిపూర్త‌వుతుంది. పోల‌వ‌రం కూడా  కంప్లీట్ అవుతుంది. ఆపై కేంద్ర‌ప్ర‌భుత్వంతో ఉన్న  స‌ఖ్య‌త కార‌ణంగా ఇంకా ఎన్నో మంచి ప‌నులు జ‌రుగుతాయి కాబ‌ట్టి.. మాకీ ప్ర‌భుత్వ‌మే బాగుంద‌ని అన్నారట ఆంధ్ర‌ప్ర‌జ‌లు. ఇక చంద్ర‌బాబు అపార‌ అనుభ‌వం, లోకేష్ యువ‌నాయ‌క‌త్వం, ప‌వ‌న్ పాపులారిటీ కూట‌మి ప్ర‌భుత్వానికి పెట్ట‌ని కోట‌లుగా మారి.. ఏపీని సంక్షేమాబివృద్ధి దిశ‌గా  ప‌రుగులు తీయిస్తున్న‌ట్టుగానూ చెప్పుకొచ్చార‌ట స‌ర్వేలో పాల్గొన్న ప్ర‌జ‌లు. దీంతో జ‌గ‌న్ కి దిమ్మ తిరిగి భ‌విష్య‌త్ బొమ్మ క‌నిపించింద‌ట‌. ఆయ‌న అధికార‌పు ఆశ‌ల‌పై ఫ్రిడ్జ్ లోంచి బ‌య‌టకు తీసిన చ‌ల్ల చ‌ల్ల‌ని నీళ్లు కుమ్మ‌రించిన‌ట్ట‌య్యింద‌ట‌. బేసిగ్గా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏం భావించాడో చూస్తే.. ఆయ‌న‌కు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకుకు కూట‌మి  వ్య‌తిరేఖ‌త ద్వారా మ‌రో 8 శాతం ఓటు బ్యాంకు త‌న పార్టీకి క‌లిసి  వ‌స్తుంది. కాబ‌ట్టి, సుమారు 50 శాతం ఓట్ల‌తో తాను 2029లో గెల‌వ‌బోతున్న‌ట్టుగా ఫీల‌య్యేవార‌ట ఇన్నాళ్లూ. ఇప్పుడా ఫీలింగ్స్ మొత్తం బూడిద‌లో పోసిన‌ట్టే అయ్యింద‌ట‌. ఆ స‌ర్వే ఫ‌లితాలు అలా అఘోరించాయ‌ట‌. ఇలా ఎందుకు జ‌రిగిందో కూపీ లాగిన  జ‌గ‌న్ కి న‌మ్మ‌లేని నిజాలెన్నో బ‌య‌ట ప‌డ్డాయ‌ట‌. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ మైండ్ సెట్లో ఆల్రెడీ ఉన్న హింసాత్మ‌క ప్ర‌వృత్తికి ర‌ప్పా ర‌ప్పా ఫ్లెక్సీల మోత కూడా తోడ‌య్యింద‌ట‌. అంతే  కాదు కొంద‌రు ఫ్యాను పార్టీ  మ‌ద్ద‌తు దారులు కౌంటింగ్ మొద‌ల‌య్యి ఫ‌లితాలు త‌మ  వైపున‌కు తిరుగుతున్నాయ‌ని తెలిసిన వెంట‌నే న‌*కుడు మొద‌ల‌వుతుంద‌ని చేస్తోన్న హెచ్చ‌రిక‌లు సైతం ఆయ‌న‌కు చేటు తెస్తున్న‌ట్టు బ‌య‌ట ప‌డింద‌ట‌.