కాంగ్రెస్ కోసం ప్రియాంక సెంచరీ కొట్టబోతోందా?!

కాంగ్రెస్ పార్టీ కోసం ప్రియాంకా రాబర్ట్ వధేరా సెంచరీ కొట్టబోతోంది. సెంచరీ అంటే క్రికెట్‌లో కొట్టే సెంచరీ కాదు.. రాజకీయ క్రీడలో కొట్టే సెంచరీ. ప్రస్తుతం పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వున్నాయి. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్‌కి పోటీ చేసి గెలిస్తే, కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయి. మరి ఇప్పటికిప్పుడు ప్రియాంక పోటీ చేసి గెలవటానికి పార్లమెంట్ స్థానం ఎక్కడుంది? ఎందుకు లేదూ.. అన్నయ్య రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచిన కేరళలోని వాయనాడ్ స్థానం వుంది కదా.. తమ కుటుంబ నియోజకవర్గమైన రాయబరేలీ స్థానంతోపాటు వాయనాడ్ స్థానం నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఇప్పుడు వయనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకోబోతున్న్టట్టు తెలుస్తోంది. అప్పుడు ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీని నిలిపి ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ప్రియాంక కూడా దీనికి సుముఖంగా వున్నారని, కాంగ్రెస్ పార్టీకి సెంచరీ గిఫ్టుగా ఇవాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కాకపోతే వాయనాడ్ ఓటర్లు ఏమంటారన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం.

Teluguone gnews banner