ప్రిన్సిపాల్ ని కత్తితో పొడిచిన అటెండర్
posted on Sep 6, 2012 @ 4:26PM
హయత్‌నగర్‌లో చైతన్య ఎయిడెడ్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై హత్యాయత్నం జరిగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో అంటెండరే ప్రిన్సిపాల్‌పై కత్తితో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులనను కాలేజీలో చేర్పిచాలంటూ ప్రిన్సిపాల్‌ను కారులో తీసుకెళ్లిన అటెండర్ రాజన్నగూడెం వద్ద కత్తితో దాడి చేశారు. అక్కడి నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అటెండర్‌ను అదుపులోనికి తీసుకున్నారు.