ఆ ప్రశ్న ప్రతిఒక్కరూ వేసుకోవాలి.. ప్రణబ్
posted on Aug 15, 2015 @ 1:33PM
గత నెలలో ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయే కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదికగా కాకుండా యుద్ధభూమిగా మారుతుందని అన్నారు. పార్లమెంట్ లో రాజకీయ పార్టీలు చేసే వైఖరి సరైనది కాదని.. ఒకసారి పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని.. ప్రజాస్వామ్యమనే అతి పెద్ద వృక్షానికి వేళ్లు బలంగా ఉన్నా దాని ఆకులు వాడిపోతున్నాయని ఆరోపించారు. మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిదే’’ అని స్పష్టం చేశారు. ఇప్పుడు మనం మన స్వాతంత్ర్య సమర యోధులకు ఇస్తున్న గౌరవ మర్యాదలు మన తరువాతి తరాలు మనకు ఇస్తాయా? అంటే దీనికి సరైన సమాధానం రాకపోవచ్చుకాని ప్రతి ఒక్కరు ఈ ప్రశ్న వేసుకోవాలని అన్నారు.