ప్రయాగ్ రాజ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముుర్ము పుణ్యస్నానం!
posted on Feb 10, 2025 @ 1:04PM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్య స్నానం ఆచరించారు. అంతకముందు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో లక్నో చేరుకున్నారు. ఆమెకు గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. లక్నో నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడ పుణ్యస్థానం ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె బడే హనుమాన్ ఆలయం, అక్షయవత్ వృక్షాన్ని సందర్శించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇలా ఉండగా మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కోట్ల మంది ఇప్పటికే పుణ్య స్నానాలు ఆచరించారు. రానున్న రోజులలో పుణ్యస్నానాలు ఆచరించే వారి సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.