పల్లకీలో గర్భిణీ..
posted on May 7, 2021 @ 3:13PM
మన దేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది. ఇంకా కొన్ని ప్రాంతాలు చీకటి లోనే ఉన్నాయి. కిరోసిన్ దీపాల కిందే వారి జీవితాలను గడుపుతున్నారు. ఆ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఉండవు. పిల్లలు చదువుకోవడానికి తరగతి గదులు ఉండవు.. ఆ ప్రాంతాల ప్రజలకి ఎమర్జెన్సీ అయితే పాత సినిమాలో చూపించినట్లు ఏ మంచం మీదనో. పల్లకి మీదనో వాళ్ళను ఆసుపత్రికి తీసుకువెళతారు.
ఓపెన్ చేస్తే.. ఆ ఊరు అడవిలో ఓ కొండా మీద ఉంది. అక్కడ వాహన సౌకర్యం ఉండదు. ఎవరికైన ఎమర్జెన్సీ అయితే ఇంకా అంతే .. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ఆసుపత్రికి పరుగెత్తాలి. కర్మకాలి వాడి గాశారం బాగాలేకుంటే బకెట్ తన్నాల్సిందే.. తాజాగా పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆమె కుటుంబ సభ్యులు మూడు కిలోమీటర్ల దూరం పల్లకీలో తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వంతాల పంచాయతీ పెదవలస గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో చిలకమ్మ నిండు గర్భిణి. ఉదయాన్నే పురిటినొప్పులు ప్రారంభం కావడంతో గతంలో ప్రభుత్వం గ్రామానికి అందజేసిన పల్లకీలో ఆమెను అటవీ ప్రాంతం మీదుగా కొండ మార్గంలో వంతాల గ్రామం వరకు మోసుకువచ్చారు. అక్కడి నుంచి ఆటోలో జి.మాడుగుల ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అడిగినంత డబ్బు కొట్టు.. అంబులెన్సు పట్టు
కరోనా పేరు వింటే కొందరి జేబులు కాళీ అవుతున్నాయి. కొందరు కరోనని వ్యాపారంగా మారుతున్నారు. డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారు. మానవ సంబంధాలు మరిచి మనిషికి డబ్బులే ముఖ్యం అంటున్నారు. కరోనా బారినపడి.. అష్టకష్టాలతో విజయవాడ రాష్ట్ర కొవిడ్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు కొంచెం కుదుటపడి.. స్వస్థలాలకు వెళ్లాలనుకున్నా.. లేక మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి వెళ్లాలనుకున్నా.. అంబులెన్స్‌లు దొరకడం లేదు. ఆసుపత్రి బయట పదుల సంఖ్యలో వాహనాలు ఉన్నా.. అందరూ సిండికేట్ అవుతున్నారు. ఎవరైనా వస్తే.. ఆసుపత్రి వెనుక మా నాయకుడున్నాడు.. మాట్లాడుకుని రండి అని చెబుతున్నారు. అక్కడికెళ్లి అడిగితే ఎక్కువ ఇస్తామంటే గాని అంబులెన్స్ పంపడంలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అంబులెన్సులకు ధరలు నిర్ణయిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అవసరముంది.
మానవత్వం చేతికున్న విశాఖ వాసి..
కరోనా సోకి సాయం కోసం ఎదురుచూస్తున్న రోగిని ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు విశాఖకు చెందిన కొండా రాజీవ్‌గాంధీ.. గాజువాక, అజామబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి(53)కి పదిరోజులు క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే రెండు రోజులుగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్నాడు. గురువారం ఉదయం నుంచి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. కుటుంబ సభ్యులకు ఏమీ చేయాలో పాలుపోక గాజువాకలో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగారు. ఎవరూ చేర్చుకోలేదు.. చివరికి విశాఖలోని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎక్కడా పడక దొరకలేదు. రోదిస్తూనే భార్య, కుమార్తె(21), కుమారుడు(19) తెలిసినవారిని ఎంతో మందితో ఫోన్‌లో మాట్లాడారు. తండ్రిని బతికించడానికి సాయం అందించాలని కోరారు. ఏమీ చేయాలో పాలుపోక ఏయూ బస్‌స్టాప్ వద్ద తండ్రికి ఆక్సిజన్ పెట్టుకుని నిరీక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో పూర్ణామార్కెట్‌కు చెందిన వైకాపా నేత కొండా రాజీవ్‌గాంధీ కారులో వెళ్తూ గుండెలను పిండేసే ఆ దృశ్యాన్ని చూశారు. వారివద్దకు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నాడు. ఎంపీ విజయసాయిరెడ్డికి సమాచారం అందించారు. అక్కడి నుంచి తన కారులో విమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి పడకను సమకూర్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కొండా రాజీవ్‌గాంధీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.