రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన ప్రభాస్
posted on Oct 6, 2022 7:42AM
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ క్రేజ్ అలా ఇలా లేదు. దేశ వ్యాప్తంగా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దక్షిణాది హీరోల్లో హీరోల్లో ప్రభాస్ కచ్చితంగా ముందుంటారు. అందుకే రావణ దహన కార్యక్రమానికి మన రెబల్ స్టార్‌కు ఆహ్వానం అందింది. విజయదశమి సందర్భంగా దిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొని రావణ దహనం చేశారు.
ఈ కార్యక్రమమంలో ప్రభాస్ ధనస్సుతో బాణాన్ని విడిచి రావణుడిని దహనం చేశారు. ఈ సమంయలో అభిమానులు పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో రామ్ లీలా మైదానం మార్మోగింది. భారత సంస్కృతి పట్ల ప్రభాస్‌కు ఉన్న అంకిత భావం చూసే ఆయనను ముఖ్య అతిథిగా పిలిచినట్లు లవ్ కుశ్ రామ్ లీలా కమిటీ తెలిపింది. ఏటా దసరా రోజున ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో విజయదశమి వేడుకలు చాలా చాలా ఘనంగా జరుగుతాయి. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా రావణ దహనం కార్యక్రమం జరగలేదు. దీంతో ఈసారి ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరైనా ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేశారు. దేశం నలుమూలల నుంచీ 22 మంది సెలబ్రిటీలను ఆహ్వానించారు. వారిలో ప్రభాస్ ఒకరు.
కాగా రామ్ లీలా మైదానంలో జరిగిన రావణ దహనం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలు దేశాల రాయబారులు హాజరయ్యారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ఆయన రాముడిగా నటించిన ఆదిపురుష్ టీజర్ విడుదలైంది. రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి.
టీజర్ లో రావణుడు, హనుమంతుడి ఆహార్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నా.. ఆది పురుష్ టీజర్ 100మిలియన్స్‌కి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఆదిపురుష్ లో రాముడిగా నటిస్తున్నందునే ప్రభాస్ కు రామ్ లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమానికి హాజరై రావణ దహనం చేసే అవకాశం దక్కిందని అంటున్నారు.