ప్రభ హత్యపై దర్యాప్తు ముమ్మరం

 

వారం రోజుల క్రితం ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన ప్రవాస భారతీయురాలు, ఐటీ కన్సల్టెంట్ ప్రభా అరుణ్ కుమార్ (41) కేసు దర్యాప్తును ఆస్ట్రేలియా పోలీసులు ముమ్మరం చేశారు. ఈ హత్యకేసులో నిందితుల కోసం తాము తీవ్రంగా అన్వేషణ జరుపుతున్నామని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రభ గత శనివారం నాడు తన భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మీద దాడి చేసి హత్య చేశారు. ప్రభ హత్యకు కారణాలు ఇంకా వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. ఇదిలా వుంటే, ప్రభా అరుణ్ కుమార్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియల నిర్వహణ కోసం ప్రభ మృతదేహాన్ని ఆమె స్వస్థలం మంగళూరుకు తీసుకుని వెళ్ళారు.

Teluguone gnews banner