పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేంటి? పవన్ కళ్యాణ్ ప్రశ్న!
posted on Apr 15, 2014 @ 5:36PM
విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడైన పొట్లూరి ప్రసాద్ విజయవాడ నుంచి తెలుగుదేశం ఎంపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్కామ్స్ లో వున్న పొట్లూరి ప్రసాద్ ఎన్నికలలో పోటీ చేయడమేంటి? దానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడమేంటన్న ప్రశ్నలు వినిపించాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. పొట్లూరి ప్రసాద్ తన మిత్రుడే తప్ప తాను పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ ఎంపీ టిక్కెట్ కోసం రికమండ్ చేయలేదని చెప్పారు. అలాగే పొట్లూరి ప్రసాద్‌కి సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని, లక్షల కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్న జగన్ ఎన్నికలలో పోటీచేయగా లేని తప్పు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిన పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.