సీమాంధ్రలో పోలింగ్ శాతం.. గతంతో పోలిస్తే ఎక్కువే
posted on May 8, 2014 @ 12:26PM
బుధవారం సీమాంధ్రలో జరిగిన పోలింగ్‌లో దాదాపు 80 శాతం ఓట్ల పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ప్రకటించారు. బుధవారం ఎనిమిది గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటి వరకు 80 శాతం పోలింగ్ జరిగిందని, అప్పటికి కూడా పోలింగ్ జరుగుతూ వున్నందున కచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. మొత్తమ్మీద 2009 సంవత్సరం ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలవారిగా 2009, 2014 సంవత్సరాలలో పోలింగ్ శాతం వివరాలు ఇలా వున్నాయి.
శ్రీకాకుళం - 76% (2014) - 75% (2009)
విజయనగరం - 78% (2014) - 76% (2009)
విశాఖపట్నం - 73% (2014) - 73% (2009)
తూర్పు గోదావరి - 78% (2014) - 78% (2009)
పశ్చిమ గోదావరి - 78% (2014) - 84% (2009)
కృష్ణ - 81% (2014) - 80% (2009)
గుంటూరు - 84% (2014) - 79% (2009)
ప్రకాశం - 80% (2014) - 77% (2009)
నెల్లూరు - 73% (2014) - 71% (2009)
కడప - 75 %(2014) - 75% (2009)
కర్నూలు - 76% (2014) - 70% (2009)
అనంతపురం - 80% (2014) - 73% (2009)
చిత్తూరు - 80% (2014) - 77% (2009)