జాన్ బీ, జహాన్ భీ..... వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రధాని
posted on Apr 11, 2020 @ 6:27PM
మార్చి 24 నాటి తన ప్రసంగంలో ప్రధాన మంత్రి మోది మాట్లాడుతూ, జాన్ హైతో జహాన్ (బతికుంటే... ఆర్థికాన్ని చూసుకోవచ్చు) అన్నారు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నినాదం మారింది.
ప్రధాని మోదీ ఇపుడు జాన్ బీ, జహాన్ భీ, జీవితాలు ,ఆర్థిక వ్యవస్థ రెండూ ముఖ్యమైనవే అన్నారు. అటు ప్రాణాలు, ఇటు ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలని అని మోదీ చెప్పారు. దేశ ప్రజల ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.
ప్రాణాంతక వైరస్ నుంచి ఇటు ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూనే అటు ఆర్థికవృద్దిని దృష్టిలో పెట్టుకుని గురుతర బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశ ఉజ్జ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాబోయే 15 రోజులు చాలా కీలకమని పేర్కొన్నారు.