సోమ్ నాధ్ ఆలయానికి అమోధ్య రామాలయానికి ఏంటీ లింకు?
posted on Aug 11, 2020 @ 12:26PM
రాజ్యాంగం ఏం చెబుతోంది.
కొద్ది రోజుల కిత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పత్నీసమేతంగా కాకుండా ఒంటరిగా అయోధ్యలో మందిర భూమి పూజకు వెళ్ళడం సరైనదైనా అనే విషయంపైన పెద్ద చర్చ జరుగుతోంది. ఇదొక్కటే కాదు అయోధ్య విషయంలో మోడికి సంబందించి అనేక ఆసక్తి కరమైన విషయాలు ఉన్నాయి. చాలా మందికి తెలియదు కానీ దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలకు వెళ్ళే మోడీ, అసలు అయోధ్యకు గత ఆరేళ్ళలో వెళ్ళనే లేదు. ఏకంగా భూమి పూజ సందర్భంగా గుజరాత్ కు చెందిన మోడీ అయోద్యకు వెళ్ళి సెక్యులర్, ఆద్యాత్మిక పరమైన వాదోపా వాదాలకు తెరిలేపారు. అదే గుజరాత్కు చెందిన సోమ్ నాధ్ ఆలయమే అసలు స్వతంత్ర భారతావనిలో మందిర రాజకీయాలకు తొలి ఆనవాలు కావడం విశేషం.
రాజేంద్రప్రసాద్ భారత రాష్ర్టపతిగా ఉన్నపుడు కేంద్రమంత్రి మున్షి ఆహ్వానం మేరకు 1951లొ గుజరాత్లో సోమ్నాధ్ అలయం శంఖుస్థాపనకు ఆయన వెళ్ళారని అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ ఆయన్ను బహిరంగంగా విమర్శించారు. ఇపుడు అదే గుజరాత్ కు నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి హోదాలో అయోధ్య లోని రామమందిర భూమి పూజకు వెళ్ళారు. 1990 లో రామనిర్మాణమే రాజకీయ ఎజెండాగా అద్వానీ రధయాత్ర చేసి బీజేపీ ఎదుగుదలకు రాచబాట వేస్తే, అదే విషయంలో ఖంగు తిని దశాబ్దాల కాలంలో రాజకీయంగా ఖంగు తిన్న కాంగ్రెస్కు మరో చరిత్ర ఉంది.
సెక్యులర్ పార్టీగా పేరున్నకాంగ్రెస్ లో ప్రధాన మంత్రిగా ఉన్నపుడు రాజీవ్ గాంధీ అయోధ్య నుంచే 1989 లోక్ సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అదే గుజరాత్ లో ఎన్నికల ప్రచారాల కోసం అక్కడ అన్ని మందిరాలకు వెళ్ళారు. ఆయన తాత గారైన నెహ్రూ బారత ప్రెసిడెంట్ సోమ్ నాథ్ ఆలయానికి వెళ్ళడాన్ని ఆక్షేపించారు. ఇంకా తమాషా విషయం ఏంటంటే 1949లొ విగ్రహాలు అయోధ్యలో ప్రతిస్థాపించినపుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ అధినాయకత్వంలో. అపుడు మసీదు గేట్లను మూసి వేసి, ఉదయం సాయంత్రం ప్రార్ధనలు మొదలుపెట్టారు. ఆ తరువాత 1986లొ రాజీవ్ గాంధీ ప్రభుత్వమే గేట్లను తెరిచి వివాదానికి దారి తీసి , శిలాన్యాస్ కు కారణమైంది. ఫైజాబాద్ ఎన్నికల ప్రచారంలో అదే రాజీవ్ గాంధీ రామ మందిరం కట్టిస్తామని కూడా హామీ నిచ్చారు.
పివి నరసింహారావు హయాంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు గురై, అది అంతమంగా బీజేపీ ఎదుగుదలకు, కాంగ్రెస్ పతనానికి కారణమైంది. దీన్ని బట్టి చూస్తే మందిర రాజకీయాలు మమూలు రాజకీయాల కంటే శక్తివంతమైనవని అర్ధం కావడం లేదూ. కాకపోతే ఇదంతా రాముడి మహిమని, సెక్యులర్, హిందూ వ్యతిరేక కాంగ్రెస్ అంతు చూసింది రాముడేనని అనే హిందూ వాదులు లేకపోలేదు కానీ కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం దీనిని హిందువుల మక్కాగా చేసే ప్రయత్నం చేస్తుందనేది నిర్విదాంశం. ఇంతకీ రాజ్యాంగ ప్రకారం ప్రధాన మంత్రి ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళచ్చా అంటే ఎక్కడా రాజ్యాంగలో వెళ్ళకూడదు అని లేదు. రాజ్యంగ స్పూర్తి ప్రకారం అన్ని మతాలకు సమదూరంగా ఉండాలి, గౌరవించాలి కానీ మత వ్యతిరేకత అక్కర్లేదు.