పోలీస్ ఆంటీ.. కర్ర ఇస్తావా..!
posted on Sep 7, 2022 @ 12:14PM
పోలీసులు అనగానే కరకుగా ఉంటారన్నది అందరి మనసులో ఉన్న సహజ అభిప్రాయం. అది కొంత వరకే నిజం. పోలీసులకు మనసు ఉంటుంది. కఠినంగా ఉండడం అనేది పరిస్థితులను అనుసరించి ఉంటుంది. దొంగల్ని పట్టినపుడు, రోడ్డు మీద ఆకతాయిల్ని కొట్టేటపుడు, రోడ్డు సెన్స్‌లేకుండా వెళ్లే వాహ నాలను పట్టినపుడు ఆగ్రహించడం తిట్టడం, కొండకచో కొట్టడమూ చేస్తుంటారు. కానీ ఖాఖీల్లోనూ చక్కగా స్పందించే మనసు ఉంటుంది. చాలామంది ఇపుడు కొత్తగా సర్వీసుల్లో చేరేవారిలో మంచి విద్యాబుద్ధులు ఉన్నవారు, మంచి చేయడానికి దూకుడుగానూ వ్యవహరిస్తారన్నది ఉన్నమాట. ఇక్కడో పిల్ల పోలీసు కర్రకోసం మహిళా కానిస్టేబుల్‌ని అడుగుతుం డడం చూస్తున్నారు.
పిల్లలకు ప్రతీదీ ఆటవస్తువే. పోలీసు చేతిలో కర్ర అయినా సరే! నిత్యం డ్యూటీతో విసిగెత్తి ఉండేవారికి ఇలాంటి పిల్లల ఆటలు కాస్తంత ప్రశాంతతనిస్తాయి. అందుకే ఆ పోలీసామె ఆ పిల్లను కొంత ఆటపట్టిం చింది. కర్ర అడగ్గానే ఇవ్వడం లేదు.. దాన్ని దాచే ప్రయత్నం చేసింది. కానీ పిల్లలు చూపు మరల్చరు. వారి దృష్టి ఎప్పుడూ కావాల్సిన దానిపైనే ఉంటుంది. ఒక్కసారి ఇవ్వమని గోల చేసింది.
పిల్లల మొండితనంలోనూ అందం, ఆకర్షణా ఉంటాయి. దానికి ఎవరయినా ఫిదా కావాల్సిందే. ఈ పోలీ సామె కూడా! అందుకే ఆటసరదాలు ఆడినంతసేపూ ఆడి తర్వాత ఓ క్షణం పాటు చేతికి ఇచ్చే ఉంటుం ది. దాన్ని ఆ చిన్నారి తన కంటే పెద్దదిగా ఉందని పట్టుకోను ఇబ్బంది పడే ఉంటుంది. కర్ర ఎక్కడ తగిలి ఏడుస్తుందోనని పోలీసామె కూడా అంతే జాగ్రత్తగా మరో చివర్న పట్టుకునే ఉంటుంది. పిల్ల తల్లిదండ్రుల మాట అటుంచితే, ఓ సమయంలో వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఇలాంటి స్నేహమే పోలీసామె ఆశిం చింది. పోలీసులంతా ఆశించేది కూడా ఇదే. ప్రజల నుంచి కూడా ఎక్కడన్నా స్వచ్ఛ మైన స్నేహ భావాన్ని,