కోవూరు మినీమహానాడుకు చంద్రబాబు
posted on Sep 7, 2022 @ 12:05PM
ఏపీలో జగన్ పాలన పట్ల ప్రజల్లో విముఖత పెరిగిపోయి, విపక్షాలు అధికారంలోకి రావడానికి మంచి అవ కాశాలు లభిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రచారం లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 14 నుంచి నెల్లూరు జిల్లాలో పర్యటించడానికి సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయపరిస్థితులను ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు తెలుగు దేశంపార్టీ అధినే చంద్రబాబునాయుడు, నాయకులు కూడా రెండింతల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తు న్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయసేకరణకు చేపట్టిన గడప గడపకు అనే కార్యక్రమం ఘోరంగా విఫలమయింది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను తిరస్కరించారు. మరోవంక తెలుగు దేశం చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టి వైసీపీ ప్రభుత్వ పాలన, నాయకుల పనితీరు గురించి ప్రజల్లో అవగాహన కల్పించి ఆకట్టుకునేందుకు ప్రజల్లోకి వెళ్లిన తెలుగు దేశం నాయకులు, ఎమ్మెల్యేలు, వీరాభిమానులను ప్రజలు ఎంతో ఆదరించి ఆశ్చర్యపరిచారు. ప్రజలు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం నాయకుల వైపు మొగ్గు చూపారు.
ఈ నేపథ్యంలో వైసీపీకి గట్టి పట్టుందని చెబుతున్న నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు పర్యటన ఖరారయింది. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు 14వ తేదీన కోవూరు నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించనున్నారు. 15న నెల్లూరులో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. జిల్లాలో తెలుగుదేశం పట్ల ప్రజల ఆద రణ, జిల్లా నాయకులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇంతవరకూ జరిగిన ప్రజాకర్షణ అంశాల గురించి చర్చించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 16న వెంకటగిరి, శ్రీకాళహస్తిలో బాదుడే బాదుడు ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా వైసీపీలో లుకలుకలు బయటపడి నందువల్ల టీడీపీ ర్యాలీలు, సమావేశాలతో భారీ ప్రచార వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమయింది.
ఇదిలా ఉండగా, నేడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్త యిన సందర్భంగా రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మిని మహానాడులు నిర్వహిం చనున్నారు. మహానాడు నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించేందుకు టీడీపీ నేత లోకేష్ కావలి వెళ్లనున్నారు.
16న వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు రోడ్ షో లో పాల్గొంటారు.