కారును ఢీకొట్టిన విమానం.. ముగ్గురు మృతి..
posted on Mar 17, 2021 @ 2:43PM
మనం బాడ్ టైం నడుస్తుంటే ఆ గాడ్ కూడా మనల్ని కాపాడలేడు. కొన్ని సార్లు అందుకు వ్యతిరేకంగా కూడా జరుగొచ్చు . కానీ మనకు నెల పై నూకలు చెల్లితే.. ఇక అంతే. మన యమలోకం సర్వం సిద్ధం అయినట్లే. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయిన, సీటు బెల్టు పెట్టుకోక పోయిన పోలీసులకు చలాన్ కట్టాలని తెలుసు. కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించిన. సీటు బెల్టు కూడా పెట్టుకున్నాడు. అయినా వాళ్ళని మరణం మందలించింది. గాల్లో వెళ్లే విమానం రోడ్డు మీద వెళ్లే కారు పైన పడుతుందని ఎవరైనా ఊహిస్తారా.. కనీసం మాట వరసకైనా అనుకుంటారా.. కానీ ఈ సంఘటన మాత్రం ఈ విషయం గురించి మాత్రాడుకునేలా చేసింది. ఒక మినీ విమానం కారు మీదపడి పడింది.
విమానం కారు పైన కుప్పకూలడంతో కారులో వెళ్తున్న ఒక పిల్లవాడి తో సహా ముగ్గురు దుర్మణం చెందారు. అమెరికాలోని ఫ్లోరిడాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్‌యూవీ కారుపై ఓ చిన్న విమానం కుప్పకూలడంతో నాలుగేళ్ల బాలుడి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఫ్లోరిడాలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. ఫ్లోరిడా విమానాశ్రాయానికి వెళ్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా ఇంజన్ ఫెయిల్ కావడంతో ఓ కారుపై కుప్పకూలింది. ఈ ఘటనలో తన తల్లితో కారులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల బాలుడు టేలర్ బిషప్ అక్కడికక్కడే చనిపోయాడు. అలాగే విమానంలోని ఇద్దరు సిబ్బంది కూడా మరణించారు. బాలుడు తల్లి మేగన్ బిషప్ మాత్రం స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమెను హాలీవుడ్ మెమోరియల్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, కారుపై విమానం కూలిన తర్వాత ఒక్కసారి భారీగా మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.