అంత సీన్ లేదు... కాల్ డేటా ఇవ్వాల్సిందే
posted on Jul 23, 2015 @ 4:28PM
ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ ప్రభుత్వానికి.. ఆంధ్రాప్రభుత్వానికి మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులకు, ఇటు సర్వీసు ప్రొవైడర్ల తరపు న్యాయవాదులకు మధ్య వాదనలు జరిగాయి. అయితే సర్వీసు ప్రొవైడర్లు మాత్రం తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ఇవ్వద్దని చెప్పిందని.. ఇస్తే ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించిందని తెలియజేశారు. అంతేకాదు కేంద్రం కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిన పని లేదని చెప్పిందని తెలిపారు. అయితే దీనికి కోర్టు అలాంటివి ఇక్కడ చెల్లవు.. పాలనా విధానం వేరు.. చట్టాలు వేరు.. కాల్ డేటా ఇవ్వాల్సిందే అని తేల్చిచెప్పింది. కానీ సర్వీసు ప్రొవైడర్లు అంతటితో ఆగారా అంటే లేదు.. కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పాపం అక్కడ కూడా వాళ్లకి మొట్టికాయ పడింది.
ఈరోజు సర్వీసు ప్రొవైడర్లు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ సిట్ అధికారుల అడిగిన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కాల్‌డేటాను వారం రోజుల్లోగా ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయితే సర్వీసు ప్రొవైడర్లు తరపు న్యాయవాది మాట్లాడుతూ కాల్ డేటా ఇస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ చేస్తానని హెచ్చరించిందని చెప్పడంతో దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తూ సుప్రీం జ్యుడిషియల్ ఆర్డర్ ఉన్నప్పుడు దాని ముందు ఏ ఆర్డ్‌ర్స్ పనిచేయవని.. ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని సూచించింది. ఈ నేపథ్యంలో కాల్ డేటా ఇవ్వడానికి తమకు కొంత సమయం కావాలని సర్వీస్‌ప్రొవైడర్ల కోర్టును కోరడంతో వారం రోజుల పాటు గడువును ఇచ్చింది. దీనిలో భాగంగానే సుప్రీంకోర్టు విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు కొన్నిసూచనలు చేసింది. కాల్‌డేటా ఇచ్చాక సీల్డ్ కవర్‌ను మూడు వారాల వరకు తెరచి చూడకూడదని, కాల్‌డేటాను స్వీకరించిన అనంతరం విచారణను నెలరోజుల పాటు వాయిదా వేయాలని విజయవాడ కోర్టును ఆదేశించింది.