వైఛీపీ.. జనం తీర్పు ఆదే!

ఏపీ లో కూటమి ప్రభంజనం సృష్టించింది. వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ కు వరుసగా మూడోసారీ నిరాశే మిగిలింది.  షర్మిల ట్రంప్ కార్డ్ పనిచేయలేదు. ఆమె స్వయంగా పోటీ చేసిన కడప లోక్ సభ స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయారు.  2021లో చంద్రబాబుకు అసెంబ్లీ జరిగిన అవమానం తో ఆయన సభకు మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు.  

ఈ ఎన్నికలలో 144 సీట్లతో పోటీచేసి 135 స్థానాలు గెలిచి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.  జగన్ అరాచకపాలన అంతం చేయడమే లక్ష్యం. ఇందు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా చూస్తాను అని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబును స్కిల్ కేసులో జగన్ సర్కార్ అన్యాయంగా అరెస్టు చేసిన సందర్భంలో ఆయనతో జైలులో ములాఖత్ అయిన పవన్ కల్యాణ్.. అక్కడే తెలుగుదేశంతో కలిసి పని చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత బీజేపీనీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసేలా ఒప్పించారు.   ప్రభుత్వ ఓటు చీలకండా చివరివరకూ కాపాడాలని జన సేనాని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకుని పోరాడారు. ఆయన కృషి ఫలించినది. మూడు పార్టీల మధ్యా ఓట్ల బదలీ నిరాటంకంగా జరిగింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలలోనూ విజయం సాధించింది. అలాగే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలలో ఎనిమిది చోట్ల విజయం సాధించింది.  కూటమి ఐక్యత వైసీపీని   11 స్థానాలకు పరిమితం చేసింది.  

అమరావతిలో రైతులు,మహిళలపై దమనకాండ,నిరుద్యోగం,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చంద్రబాబుతో సహా టీడీపీ నేతల అరెస్టులు, మద్యనిషేధమని  నకిలీ బ్రాండ్స్ తో ప్రజారోగ్యం హరించడం,  పరిశ్రమలు రాకపోవడం ,కరెంట్ చార్జీలు పలుసార్లు పెంచడం, రైతులకు సాగునీరు సరైనసమయంలో అందించకపోవడం, మితిమీరిన అహంకారంతో వైసీపీ అంటే జనం ఛీకొట్టే స్థితికి వచ్చారు.   

Teluguone gnews banner