ముద్రగడ ఇక కాపు కాదు.. రెడ్డి!
posted on Jun 5, 2024 @ 11:02AM
ముద్రగడ పద్మనాభం ఇకపై కాపు కాదు... రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ని ఓడించకపోతే తాను తన పేరును రెడ్డి అని మార్చుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తోపాటు జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటిస్తూ, ‘‘గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాల్ విసిరానండి.. పిఠాపురంలో ఓడించి పంపకపోతే, నా పేరును ‘పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పాను. నా మాటకు నేను కట్టుబడి వున్నాను. నేను ఓటమి చెందానండి.. అన్నమాట ప్రకారం నా పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చమని కోరడం కోసం గెజిట్ పబ్లికేషన్‌కి సంబంధించిన దరఖాస్తులు తెప్పించాను. వీటిని పూర్తిగా నింపి, పేరు మార్పు కో్సం నేను దరఖాస్తు చేస్తానండి’’ అన్నారు.
ముద్రగడ పద్మనాభం తన పేరును ‘పద్మనాభరెడ్డి’గా మార్చుకుంటున్న నేపథ్యంలో, ఆయనను ఇక ‘కాపు’గా భావించాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఎంతమాత్రం కాపు నాయకుడు కాదు కాబట్టి.. ఇకపై కాపులు ఆయనని కాపు నాయకుడిగా గౌరవించడం మానేయాలి అని కాపులు భావిస్తున్నట్టు సమాచారం.