కట్టేసి పేడ తినిపించి.. చిన్నారులపై కిరాతకం..
posted on Apr 2, 2021 @ 10:32AM
మాయ మైపోతున్నాడమ్మా .. మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూస్తూ మానవత్వం ఉన్న వాడు అనే పాట ఆ కవి కలం నుండి వూరికే రాలేదు..అలాంటి ఘటనలు ఎన్నో చూసి రాసి ఉంటాడు. ఆ కవి చెప్పినట్లు నిజగానే మనుషుల్లో మానవత్వం కవువై.. క్రూరత్వం పెరుగుతుంది. నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల పై కూడా కొందరు మూర్ఖులు తన ప్రతాపం చూపుతున్నారు.
తాజాగా తమ కుక్క ను వెతుకుంటూ మామిడి తోటలోకి వెళ్లారు ఇద్దరు మైనర్ బాలురు. ఆ తోటలోకి వెళ్లడమే ఆ మైనర్ల పాలిట నేరమైంది.. తోటలో ఉన్న కాపలాదారులు మానవత్వం మరిచి వారి పట్ల అనాగకరికంగా ప్రవర్తించారు.. కాళ్లు చేతులు కట్టేసి చితకబాదారు. అంతటితో ఆగక బలవంతంగా పేడ తినిపించారు ఆ నీచులు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన బేడ బుడగజంగాల బాలురు ఇద్దరు తప్పిపోయిన తమ కుక్క కోసం గాలిస్తూ కంఠాయపాలెంలోని వీరభద్రరావు మామిడి తోటలోకి వెళ్లారు. వారు మామిడి కాయలు దొంగిలించడానికి వచ్చారంటూ కాపలాదారులు వారి కాళ్లుచేతులు కట్టేసి బంధించారు. ఆ తర్వాత బలవంతంగా పేడ తినిపిస్తూ పైశాచికంగా ప్రవర్తించారు. బాలురపై దాడికి పాల్పడిన బానోత్ యాకు, బానోతు రాములుపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.