పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్స్-2
posted on Mar 14, 2014 @ 11:01PM
పవన్ కళ్యాణ్ ప్రసంగమంతా హైలైట్. అవి ఏ స్క్రిప్టులో కనబడవు, దొరకవు. ఎందుకంటే అవి ఆయన హృదయంలో నుండి వచ్చినవి. వాటిలో మళ్ళీ కొన్ని హైలైట్స్ అని వేరు చేసి చెప్పడం చాలా కష్టమే! అయినా కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసినవీ ఉన్నాయి.
ఎవరన్నారు...నేను అన్నయ్యను వ్యతిరేఖిస్తున్నానని? అన్నయ్యను వ్యతిరేఖించడం లేదు. ఆయన పార్టీని మాత్రమే వ్యతిరేఖిస్తున్నాను. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పుణ్యమాని తండ్రి వంటి అన్నయను రాజకీయాలలో ఎదుర్కోవలసివస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్న జైరామ్ మరో కేంద్ర మంత్రి అయిన అన్నయను గౌరవించడం నేర్చుకోవడం మంచిది.
నా వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి ఎవరయినా విమర్శలు చేయదలిస్తే వారు కూడా అటువంటి ప్రతివిమర్శలకు సిద్దంగా ఉండాలి. రాహుల్ గాంధీ అయినా రాబర్ట్ వాద్రా అయినా ఐ డోంట్ కేర్..ఎవరినీ వదిలిపెట్టను..
జగ్గారెడ్డి వంటి వ్యక్తి తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించి ఉండి ఉంటే, రాష్ట్ర ప్రజలు విడిపోతూ స్వీట్లు పంచుకొనేవారు. ఆయనకున్న జాతీయ దృక్పదం మరే కాంగ్రెస్ నేతలో లేడు.
అరవై ఏళ్లుగా జరుగుతున్నా తెలంగాణా ఉద్యమాలు, పదేళ్లుగా సాగుతున్న తెలంగాణా ఉద్యామాలు, వందల మంది అమాయకులయిన యువకులు చనిపోయిన తరువాత కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇవ్వాల్సిన అవసరం ఉందని అర్ధంకాలేదా? సినిమాలలో వేషాలు వేసుకొనే నాకే ఆర్ధమయిన సంగతి రాజకీయాలలో తలలు పండిపోయిన మీకెందుకు అర్ధంకాలేదు. అర్ధం అయిన తరువాత పార్లమెంటులో కేవలం 26నిమిషాలలోనే ఎలా పూర్తి చేసారు? చేసినా ఆంధ్ర, తెలంగాణా ప్రజలు సంతోషంగా ఉండేలా ఎందుకు చేయలేకపోయారు?