పోర్టులు సరే ముందు రోడ్లను బాగు చేయండి.. సీఎం జగన్ పై పవన్ సెటైర్లు
posted on Sep 7, 2021 @ 9:24PM
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితిపై మరోసారి సీరియస్ గా స్పందించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం అంటూ సమీక్షలో కలిపారు తప్ప ఇంకేం లేదని పవన్ విమర్శించారు. జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితిని తెలిపారన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దెబ్బ తిన్న రహదారుల సమస్య గురించే సీఎం మాట్లాడాలన్నారు. ‘సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం’ అనే చందంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉందని జనసేనాని సెటైర్లు వేశారు. రోడ్ల దుస్థితిపై చేస్తున్న సమీక్షలో వీటిని దూర్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే వెంటనే రోడ్లకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. వినాయక చవితికి కరోనా నిబంధనలు వర్తింపజేయడం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ కార్యక్రమాలకు కరోనా నిబంధనలు అడ్డురావా? సంస్మరణ సభకు కరోనా లేదా? అని నిలదీశారు. విపక్షాలు నిరసనలు చేస్తే కరోనా కేసులా? అంటూ మండిపడ్డారువినాయక చవితి ఉత్సవాలపై ఎందుకు నిషేధం విధించారో నిజంగా తనకు అర్ధం కాలేదన్నారు పవన్ కల్యాణ్. కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిసంప్రదాయాలు, ధర్మానికి ముడిపడి ఉన్న వినాయక చవితి పండగకు కోవిడ్ నిబంధల వల్ల అనుమతులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. కోవిడ్ నిబంధనలు కేవలం వినాయక చవితి పండగకు మాత్రమే వర్తిస్తాయా? వైసీపీ ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పుట్టిన రోజులకు, పండగలకు, పబ్బాలకు వర్తించవా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామంటే మాత్రం కోవిడ్ నిబంధనలు గుర్తొస్తాయా? కోవిడ్ నిబంధనలు దేనికి వర్తిస్తాయి? దేనికి వర్తించవు అనేది మన రాష్ట్రంలో ప్రభుత్వమే డిసైడ్ చేస్తోందని పవన్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు వినాయక చవితి పూజలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే ఇక్కడ మాత్రం పండగను చేసుకోవద్దని చెప్పడం దారుణమన్నారు. గణపతి విగ్రహాలను అమ్మే వ్యక్తులను అరెస్టు చేయడం, విగ్రహాలు తీసుకుపోవడం చూస్తుంటే పాలకులు దేని మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం అంటూ సమీక్షలో కలిపారు తప్ప ఇంకేం లేదని పవన్ విమర్శించారు. జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితిని తెలిపారన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దెబ్బ తిన్న రహదారులు. ఆ సమస్య గురించే మాట్లాడాలన్నారు. ‘సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం’ అనే చందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉందని జనసేనాని సెటైర్లు వేశారు.రోడ్ల దుస్థితిపై చేస్తున్న సమీక్షలో వీటిని దూర్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు పవన్ హస్తిన చేరుకున్నారు. ప్రహ్లాద్ జోషితో భేటీ అనంతరం, బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.