పవన్ కూడా జగన్ లా చేస్తున్నాడా?
posted on Sep 21, 2015 @ 11:48AM
అధికారికంగా పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడటం కాని.. పదవి కోసం పాకులాడటం కాని చేయలేదు. కానీ బీజేపీ.. టీడీపీ లను మిత్రపక్షలుగా చేసుకొని ఆపార్టీస కోసం తనవంతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత ఆపార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా ఎలాంటి పదవి ఆశించలేదు. అంతేకాదు టీడీపీ మిత్రపక్షమైనప్పటికీ కూడా ప్రత్యేక హోదాపైన.. భూసేకరణపైన టీడీపీ నేతలకు చురకలు అంటించారు. భూసేకరణ విషయంలో తానే స్వయంగా నిరసనకు దిగి రైతుల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి భూసేకరణను ఆపేసింది. అయితే ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తమిళనాడులో దీక్ష చేపడుతున్నారన్న సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం నిర్భంధ తమిళ బాషా చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో తమిళనాడులో తెలుగు బాషను తొక్కివేస్తున్న తరుణంలో ఆయన ఈ దీక్షను చేస్తున్నారు. ఈ నెలఖరున జరగబోయే ఈ దీక్షకు పవన్ ప్యాన్స్ అప్పుడే ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు.
అయితే అంతా బాగానే ఇప్పుడు ఈ పవన్ దీక్షపై పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కూడా జగన్ తరహాలో అన్నిటికీ దీక్షలు చేయడం ప్రారంభించారు అంటూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా రాష్ట్రంలో ఏమైనా చిన్నసమస్యలు వచ్చినప్పుడే ఇరు పక్షాలు కలిసి కూర్చొని వారికి పరిష్కారాన్ని ఆలోచిస్తాయి. అంతకీ సమస్యలు తేలకపోతే అప్పుడు దీక్షల మార్గాన్నిఅనుసరిస్తారు. మరి అలాంటిది పక్క రాష్ట్రంతో సమస్య అంటే ఆలోచించాల్సిన విషయమే. ఈ నేపథ్యంలో దీక్షల కుంటే కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటేనే రెండు రాష్ట్రాలకు కూడా మంచిది. మరి అలాంటిది పపన్ కళ్యాణ్ ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా దీక్ష అంటూ రంగంలోకి దిగుతున్నారు.
పోనీ తెలంగాణ ముఖ్యమంత్రి జయలలిత అపాయింట్ మెంట్ పవన్ కు దొరకదా అంటే.. దేశ ప్రధాని అయిన నరేంద్రమోదీనే ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నారు పవన్. మరి అలాంటిది జయలలితి అపాయింట్ మెంట్ దొరకడం పెద్ద విషయమేమి కాదు. అలా చేయకుండా అమ్మకి వ్యతిరేకంగా పవన్ తమిళనాడులో చేయబోతున్న దీక్ష కేవలం ప్రచారం కోసమే అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మరి ఎంతోమంది దీక్షలకే తలవంచని జయలలిత మరి పవన్ కళ్యాణ్ దీక్షను ఎంతవరకూ పట్టించుకుంటుంది.. అసలు అవేమీ లేకుండా ఒకసారి జయలలితతో మాట్లాడి.. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు దీక్ష చేసినా బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.