ఈరోజు నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం
posted on Apr 25, 2014 @ 9:45AM
సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి తెలుగుదేశం, బీజేపీ నాయకులతో కలసి తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. 26న సిరిసిల్ల, హుస్నాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో, 27న ఎల్బీనగర్, అంబర్‌పేట, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో, 28న నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.