డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు
posted on Nov 30, 2023 @ 12:33PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 ప్రారంభమై 22వ తేదీ వరకూ సాగుతాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాటి నుంచీ పార్లమెంటు సీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియెట్ బులిటిన్ విడుదల చేసింది.
ఈ సమావేశాలలో కేంద్రం 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఈ 18 బిల్లులలో రెండు జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లు, ఐపీసీ సవరణ బిల్లులు ఉన్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లను 107 నుంచి 114 కు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఈ సమావేశాలలోనే సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వీటితో పాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై చర్చ, ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు..