బావతో పెళ్లికి నో.. మరదలు ఆత్మహత్య..
posted on May 25, 2021 @ 10:33AM
వాళ్ళ ఇద్దరు బావ మరదలు.. అనేది విడదీయలేని బంధమనే చెప్పాలి. ఎందుకంటే తెలుగులో కొన్నీ పదాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భార్య భర్తలు, అన్నాతమ్ముడు.. అక్క చెల్లెలు. అత్తమామలు. బావ మరదలు. ఒకవేల మనుషులు దూరం అవ్వోచ్చేమో గానీ ఈ పదాలను విడదియ్యలేం. ఇదంతా మా కెందుకు అనుకుంటున్నారా..? మనం చదవబోయే మ్యాటర్ పై పదాలతోనే ముడిపడి ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం పదండి.. వివరాల్లోకి వెళ్దాం..
అది పఠాన్ చెర్. అమ్మాయి పేరు నాగులపల్లి పూజిత. వయసు 14 సంవత్సరాలు. సంగారెడ్డి గురుకుల హాస్టల్‌లో 8వ తరగతి చదువుతుంది. ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల ఇంటి వద్ద ఉంటుంది. పూజితకు మేనబావ ఉన్నాడు. అతని పేరు సాయిబాబా. వాళ్ళు ఇద్దరు మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. జీవితాంతం కలిసి బతుకుదాం అనుకుని ఎన్నో కలలు కన్నారు..వారి విషయం ఇంట్లో తెలిసింది. వీళ్ళ ఇద్దరి పెళ్ళికి పూజిత ఇంట్లో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అంతే పూజిత కల నెరవేరుతుందనుకుంది. తన మేన బావతో సంతోషంగా ఉండొచ్చు అనుంకుంది. సడెన్ గా ఏమైందో ఏమో.. వాతావరణ శాఖ వాళ్లు సడెన్ గా తుపాన్ అని హెచ్చరించినట్లు. పూజిత తల్లి దండ్రులు ఈ పెళ్లి చెయ్యము అన్నారు.
తల్లిదండ్రులు పెళ్లి వద్దు అనడానికి కారణం ఇదే..
ఈ మధ్య తన మేనబావ తాగుడుకు బానిసవడంతో ఇంట్లో వారు అతనితో పెళ్లి రద్దు చేద్దామని నిశ్చయించారు. అప్పటి నుండి పూజిత తనలో తాను బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి గురైంది. పూజిత ఆవేశం లో తన బావ దక్కడని ఆలోచించింది గాని . తన తల్లిదండ్రులు ఎందుకు వద్దు అంటున్నారు అని ఆలోచించలేకపోయింది. దీంతో ఆదివారం సాయంత్రం ఇంటి ముందు గల స్క్రాప్‌షాప్‌లో ఇనుప రాడ్డుకు తన చున్నీతో ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన పూజిత చెల్లెలు వర్షిని ఇంట్లో వారికి తెలుపగా వెంటనే మృతురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పూజితను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతురాలి అమ్మమ్మ సూర్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్ ప్రసాద్ రావు పేర్కొన్నారు.
ప్రేమించడం తప్పు కాదు.. దాని వెనక ఉన్న నిజానిజాలు తెలుసుకోవాలి. ఓపిగ్గా వైట్ చెయ్యాలి.. అవసరం అయితే తల్లి దండ్రులను మళ్ళీ మళ్ళీ ఒప్పించాలి. అంటే గాని ఇలా చనిపోతే ఏం లాభం. అయినా ఆ అమ్మాయిది పెళ్లి చేసుకునే వారు కాదు. అసలు ఆ అమ్మాయి అమ్మానాన్నలను అనాలి.
అయినా ఈ కాలం పిల్లలు అనాలి చదువుకునే వయసులో ప్రేమ పెళ్లిళ్లు ఏంటో అర్థం కావడం లేదు.