పరిణితీ చోప్రా హాట్ రికార్డ్
posted on Sep 6, 2013 7:42AM
స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌కి పరిచయం అయిన ఓ ముద్దుగుమ్మ తొలి సినిమా నుంచి హద్దులేవి లేకుండా రెచ్చిపోతుంది. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి అందాల ప్రదర్శనకు వెనుకాడని ఈ భామ ఇప్పుడు ఓ సరికొత్త రికార్డ్ సృష్టించింది.
లేడీస్ వర్సెస్ రికీ బాల్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటి పరిణితీ చొప్రా, ప్రియాంక చోప్రా వారసురాలిగా బాలీవుడ్ తెరకు పరిచయం అయిన ఈ భామ అందాల ప్రదర్శన లో మాత్రం అక్క మించిన చెల్లిగా పేరుగా తెచ్చుకుంది.
తన రెండో సినిమా ఇష్క్‌జ్యాదేతో అందరి దృష్టిని ఆకర్షించిన పరిణితి చోప్రా హీరోయిన్‌గా సక్సెస్ అవ్వటానికి కావాల్సిన విషయాల్లో అక్క కన్నా ముందే పరిణతి సాదించింది. అయితే తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న సినిమాతో ఓ అరుదైన రికార్డ్ సాదించనుందట. ఇంత వరకు ఏ బి గ్రేడ్ సినిమాలో కూడా లేని విదంగా ఈ సినిమాలో బోలెడన్ని హాట్ సీన్స్ ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్.
ఇప్పటివరకు ఒకటి రెండు లిప్లాక్ సీన్స్‌తొ సినిమాలకు క్రేజ్ తెచ్చుకుంటున్న బాలీవుడ్ సినీ బాబులకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది పరిణితి చోప్రా. ఒకటి రెండు కాదు ఒకే సినిమాలో ఏకంగా 15 లిప్‌లాక్ సీన్స్‌లో నటించనుందట.
గతంలో క్వాయిష్ అనే సినిమాతో మళ్లికా శెరవాత్ చేసిన లిప్ లాక్ సీన్స్ రికార్డ్‌ను ఈ సినిమాతో బ్రేక్ చేయనుంది పరిణితి. తను నటిస్తున్న లేటెస్ట్ మూవీ శుద్ దేశి రోమాన్స్ ఈసినిమాలో ఈ హాట్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమా తరువాత పరిణితి చోప్రాకు మరిన్ని హాట్ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తాయంటున్నారు సినీ విశ్లేషకులు.