అక్కడైతే చూపిస్తుందట
posted on Sep 6, 2013 7:50AM
టాలీవుడ్‌లో తన అందాలు తప్ప నటన చూడటం లేదంటూ బాలీవుడ్ చెక్కేసిన ఓ హాట్ బ్యూటి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అదే పని మొదలు పెట్టింది. ఇన్నాళ్లు టాలీవుడ్ మీద అభాండాలు వేసిన ఈ భామ అక్కడ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది.
దేవదాసు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటి ఇళియానా.. తొలి సినిమాలోనే తన తీగ నడుముతో అందరిని కట్టిపడేసిన ఈ బ్యూటి తరువాత వరుస సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు తెలుగు యంగ్ హీరోస్ అందరితో సినిమా చేసిన ఇళియానా టాప్ పొజిషన్‌ను మాత్రం ఎక్కువ రోజులు నిలబెట్టుకొలేకపోయింది. దీంతో తెలుగు సినిమా ప్రేక్షకులు తన అందాలను తప్ప తన నటనను ఏ మాత్రం గుర్తించలేదంటూ తెగ వగలు పోయిందీ ఈ బ్యూటి.
అయితే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఈ బ్యూటికి బాగానే కలిసొచ్చింది. ఎటువంటి అందాల ఆరబోత లేకుండా హుందాగా కనిపించిన బర్ఫీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇళియాన తొలి సినిమాతో బాలీవుడ్లో 100 కోట్ల హిట్ నమోదు చేసింది. అయితే తొలి సినిమాతో ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకుండా నడిపించినా తరువాత మాత్రం అలా నడవదని తెలుసుకుంది ఇళ్లిబేబి. అందుకే తన బాలీవుడ్ సెకండ్ ఫిల్మ్ ఫటా పోస్టర్ నికలా హీరోలో షాహిద్ సరసన రెచ్చిపోయి మరి ఎక్స్‌పోజింగ్ చేసేసింది.
తెలుగు వాళ్ల ముందు చూపించటానికి అంత కష్ట పడినా బాలీవుడ్‌లో మాత్రం తెగ చూపించేసే సరికి ఇళియానా మీద గుర్రుగా ఉన్నారట టాలీవుడ్ సినీ జనాలు.