తిట్లలో పీహెచ్‌డీ చేశారా? ఆ పంచ్‌లు ఏందిరా బాబోయ్..
posted on Aug 7, 2021 @ 9:03PM
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేది ఎవరు? నిత్యం తిట్లు, బూతులతో విరుచుకుపడేది ఎవరు? మొబైల్ ఓపెన్ చేస్తే.. మాటలతో కంపు రేపేది ఎవరు? ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ చాలా చాలా సింపుల్. కాస్త అప్‌డేట్‌లో ఉండే వారెవరైనా ఈజీగా చెప్పేయొచ్చు. రెండు గ్రూపులు సోషల్ మీడియాలో పిచ్చ యాక్టివ్‌గా ఉంటాయి. పోటాపోటీగా రెచ్చిపోతుంటాయి. ప్రత్యర్థులను మాటలతో, తిట్లతో, బూతులతో రచ్చ రంబోలా చేస్తాయి. అందులో నెంబర్ వన్.. జగన్ బ్యాచ్. వైసీపీ పెయిడ్ గ్రూప్స్. ముద్దుగా పేటీఎమ్ బ్యాచ్‌లని కూడా అంటారు. ఇక సోషల్ మీడియాలో రెచ్చిపోయే సెకండ్ బ్యాచ్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. తమ నాయకుడిని పల్లెత్తి మాట అనకుండానే.. అంటారేమోననే అనుమానం వచ్చినా.. ఇక అంతే సంగతులు. అభిమానం పేరుతో జనసైనికులు చేసే ఓవరాక్షన్ అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో ఇటు జగన్ బ్యాచ్, అటు పీకే గ్రూప్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు మరి.
ఇక మెగా ఫ్యాన్స్‌కి వాళ్ల పాత నాయకుడు పరకాల ప్రభాకర్‌తో అస్సలు పొసగదు. మెగా లీడర్‌ను ఆడిపోసుకున్నారనే అక్కసుతో పరకాల టాపిక్ వచ్చినప్పుడల్లా చెడుగుడు ఆడుకుంటుంటారు మెగా అభిమానులు. అయితే, హుందాగా కనిపిస్తూ, పద్దతిగా మాట్లాడినట్టు అనిపించే పరకాల ప్రభాకర్ లేటెస్ట్‌గా పీకే ఫ్యాన్స్ దారిలోనే నడుస్తున్నట్టున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త.. ఒకప్పటి ప్రజారాజ్యం లీడర్.. గత ఏపీ ప్రభుత్వ సలహాదారు.. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలీని.. పరకాల ప్రభాకర్.. వారం రోజులుగా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు. పీకే ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. జనసైనికులకు దిమ్మతిరిగేలా వారి భాషలోనే పంచ్‌లతో పిచ్చెక్కిస్తున్నారు. పరకాల ట్వీట్లు మామూలుగా ఉండటం లేదు. అయితే, ఎక్కడా పవన్ కల్యాణ్ పేరు గానీ, వారి ఫ్యాన్స్ అనిగానీ నేరుగా అనకుండా.. పరోక్షంగా జనసైనికులను ట్వీట్లతో కుమ్మేస్తున్నారు. మాంచి మసాలా దట్టించి.. నూనెలో సలసలా కాగేలా కర్రు కాల్చి వాతపెడుతున్నారు. పరకాల ఫేస్‌కు.. ఆయన చేస్తున్న ట్వీట్లకు అస్సలు సింక్ అవడం లేదు. డౌట్ ఉంటే మీరూ ఓసారి ఆ ట్వీట్లపై ఓ లుక్కేయండి... ఆ పంచ్ పటాకాలు ఎలా పేలుతున్నాయో చదివేయండి..
ఇటీవల పరకాల ప్రభాకర్ పెట్టిన ట్వీట్ ఇది....
ఇంకా గోక్కుంటున్న గజ్జి బ్యాచ్‌కు అంటూ మరో ట్వీట్..
ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతున్న గజ్జి బ్యాచ్‌కి ఇవాళ్టి డోస్ అంటూ మరో ట్వీట్..
ఇంకా ఆ మూలా, ఈ మూలా తచ్చాడుతున్న పిత్తపరిగి సైన్యానికి అంటూ మరో పంచ్..
పాపం అక్కడక్కడా మూలుగుతూ పడిఉన్న పిత్తపరిగి సైన్యానికి.. ఈ సీజన్ చివరి డోస్.. మళ్లీ ఈ ఛాయలకొచ్చారో.. ఖబడ్దార్! అంటూ తన ట్వీట్లకు క్రాఫ్ హాలిడే ప్రకటించేశారు పరకాల ప్రభాకర్..