శంకర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉంది: కేర్ డాక్టర్లు
posted on Feb 1, 2013 @ 3:18PM
గ్రీన్ ఫీల్డ్ భూముల వివాదంలో మాజీ మంత్రి శంకర్‌రావును నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్యులు చెప్పడంతో కేర్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్‌రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఆయన ఐసీయూలో ఉంచామని బీపీ, షుగర్ లెవల్స్ సాధారణ సితిలోనే ఉన్నాయని, శంకర్‌రావుకు విశ్రాంతి అవసరమని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.