ఆ పెద్దాయనకి వున్న బుద్ధి కూడా జగన్‌కి లేకపాయె!
posted on Jun 12, 2024 @ 6:02PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన నరేంద్ర మోడీ, అమిత్ షా తదితర బీజేపీ నాయకులు ఒరిస్సా కూడా వెళ్ళి మాఝీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఒరిస్పా ప్రమాణ స్వీకారోత్సవంలో వున్న ఒక విశేషం ఏమిటంటే, గత 24 సంవత్సరాలుగా ఒడిషాకు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఈమధ్యే తన పదవిని కోల్పోయిన బీజేడీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలపడం మాత్రమే కాకుండా, బీజేపీ నాయకులతో అచ్చట్లు ముచ్చట్లు కూడా పెట్టారు. మరి, మన జగన్ కూడా వున్నాడు. చంద్రబాబు స్వయంగా ఆహ్వానించడానికి ఫోన్ చేసినా ఫోన్‌కి అందుబాటులో లేకుండా తప్పించుకున్నాడు. అక్కడితో ఆగాడా... ఒకవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ వున్న సమయంలోనే తన తోక విజయసాయిరెడ్డి చేత ప్రెస్‌మీట్ పెట్టించి, చంద్రబాబు మీద అవాకులు చెవాకులు పేలేలా చేశాడు. నో డౌట్.. ఈ మనిషి మారడు! ఆ ఒరిస్సా పెద్దాయన పేరు నవీన్.. ఈ ఆంధ్రా చిన్నాయన పేరు జగన్.. ఇద్దరి పేర్లలో కొంచెం పోలిక వుందిగానీ, బుద్ధిలో మాత్రం చాలా తేడా వుంది!