ఎవరినైనా వదిలిపెట్టం.. ఒబామా
posted on Dec 7, 2015 @ 10:29AM
అగ్రరాజ్యాలపై ఐసిస్ చేస్తున్న దాడులకు గాను అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉగ్రవాద చర్యలపై మండిపడ్డారు. వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అమెరికాకు హాని తలపెట్టాలని చూసే ఎవరినైనా వదిలిపెట్టబోమని.. అది ఐసిస్ కావచ్చు.. ఇంకా ఇతర ఏ ఉగ్రవాద సంస్థ అయినా కావచ్చు అని అన్నారు. ప్రపంచదేశాల్లోని ముస్లిం నేతలు ఐఎస్ఎస్ ఉగ్రవాదంపై నోరు విప్పాలని, వారి వైఖరి ఏమిటన్నది తెలపాలని పేర్కొన్నారు. అంతేకాదు మతాన్ని అధారంగా చేసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని సూచించారు. కాగా కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో ముస్లిం దంపతులు కాల్పులకు పాల్పడి 14 మందిని హత్యచేసిన నేపథ్యంలో వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఎటువంటి సాక్ష్యాదారాలు లేవని వివరించారు.