అతనిపై కన్నేసి ఉంచండి.. పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం
posted on Dec 7, 2015 @ 9:58AM
టీడీపీ అధినేత చంద్రబాబు బేజీపీ పార్టీ నేత సోము వీర్రాజు పై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్న 5వ తేదీన చంద్రబాబు సమక్షంలో బీజేపీ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ అటు బీజేపీ నుండి ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. కానీ సోము వీర్రాజు మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో చంద్రబాబు వీర్రాజు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా వీర్రాజు టీడీపీ పై విమర్శలు చేసినా చంద్రబాబు చూసీ చూడనట్టు వదిలేసేవారు. తాను మాత్రమే కాదు నేతలకు కూడా అదే సూచించేవారు. అయితే ఆ తరువాత వీర్రాజు మరీ రెచ్చిపోయి టీడీపీపై విమర్శలు చేస్తుండటంతో చంద్రబాబు కూడా అతడి కామెంట్స్ కు ధీటుగా జవాబు ఇవ్వాలని సూచించడంతో నేతలు అతని దూకుడికి బ్రేక్ వేశారు. దాంతో వీర్రాజు కొంచెం నోటి దూకుడిని తగ్గించారు. అయితే వీర్రాజు మళ్లీ ఇప్పుడు బీజేపీ-టీడీపీ సమన్వయ పార్టీకి హాజరుకాకుండా చంద్రబాబుకు కోపం తెప్పించాడు. దీంతో చంద్రబాబు వీర్రాజు వ్యవహార శైలిపై ఓ కన్నేసి ఉంచమని పార్టీ నేతలకు సూచించారట. ముఖ్యంగా కాపులను టీడీపీకి వ్యతిరేకంగా మార్చేందుకు వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నాడని.. అతని ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతలను ఆదేశించారట. మొత్తానికి వీర్రాజు వ్యవహారంపై చంద్రబాబు బానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.