జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఫస్ట్ లుక్కు
posted on Aug 31, 2012 @ 12:37PM
జూ ఎన్టీఆర్ బాద్ షా చిత్రానికి సంబంధించిన న్యూలుక్ స్టిల్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి విడుదల చేశారు. జూ ఎన్టీఆర్ బాద్ షా చిత్రంలో ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో 7 సరికొత్త హెయిర్ స్టైల్స్‌లో కనిపిస్తాడు. ఇందు కోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్ ఆర్టిస్టులను తెప్పించారు. ఈ సినిమాలో జూనియర్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని తేవడం ఖాయం అంటున్నారు. జూనియర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ హీరో నవదీప్ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం సంక్రాంతి సందర్బంగా జనవరి 11, 2013న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.