’ఎన్టీఆర్ ఇంటిని కూలిస్తే ఆమరణ దీక్షకు రెడీ’ ‘
posted on Dec 20, 2012 @ 6:34PM
సినీ ప్రపంచంలో, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన ఎన్ టి రామారావు తుది శ్వాస విడిచిన ఇంటిని ఇతరులకు అమ్మి, కూలగొట్టే ప్రయత్నాలు చేస్తే, తాను ఆమరణ దీక్ష చేస్తానని ఆయన భార్య నందమూరి లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 13 లోని ఇంట్లో ఎన్టీఆర్ మరణించిన విషయం తెలిసిందే.
‘ఎన్టీఆర్ తన కోసమే ఈ ఇంటిని కొనాలని అనుకొన్నారు. అయితే, ఆదాయపు పన్ను శాఖతో సమస్య వస్తుందనే కారణంతో అమెరికాలో ఉంటున్న తన చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి పేరుతో దీనిని కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ తన కుమార్తెకు చెప్పే ఇలా చేశారు. ఆయన మరణానంతరం ఆమెకు కొందరు మాయమాటలు చెప్పి నా ఫైకి ఉసిగొల్పారు’, అని లక్ష్మి పార్వతి అన్నారు.
ఎన్టీఆర్ జ్ఞాపకాలను శాశ్వతంగా కాపాడే విషయంలో తాను చివరి వరకూ ఎవరితోనైనా పోరాడటానికి సిద్దంగా ఉన్నానని లక్ష్మి పార్వతి తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ కుమారుడు రామ కృష్ణ చేస్తున్న ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మి పార్వతి అన్నారు.