బాపట్లలో జగన్ పార్టీ ఆఫీసుకి ‘స్పాట్’!
posted on Jun 25, 2024 @ 3:13PM
జగన్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసుల పేరుతో పెద్ద పెద్ద ప్యాలెస్‌లను నిర్మించిన విషయం తెలిసిందే. ఈమధ్యే తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వ అధికారులు కూలగొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కార్యాలయాల మీద ప్రభుత్వ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. బాపట్లలో వైసీపీ అనుమతి లేకుండా నిర్మించిన జిల్లా కార్యాలయానికి అధికారులు నోటీసులు అతికించారు. ఈ అక్రమ నిర్మాణం మీద వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సదరు నోటీసులలో పేర్కొన్నారు. తొలుత ఈ నోటీసులు అందించడానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణారావును సంప్రదించినప్పుడు ఆయన ‘అందుబాటులో లేను’ అని తప్పించుకున్నారు. దాంతో అధికారులు నోటీసులను పార్టీ కార్యాలయానికే అతికించారు. వారం రోజుల్లోగా సరైన వివరణ అందని పక్షంలో అధికారులు ఈ ప్యాలెస్‌కి స్పాట్ పెట్టడం ఖాయం!