టోల్ ఎత్తివేత యోచనలో తెలంగాణ సర్కార్.. కేంద్ర అనుమతి కోసం లేఖ

సంక్రాంతికి ప్రజలంతా తమ సొంతూళ్లకు క్యూ కడతారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలు, ప్రైవేట్ వెహికల్స్‌తో రోడ్లన్నీ   కిక్కిరిసి పోతాయి. ఇక టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంటుంది. ప్రతి ఏటా నగరాల నుంచి సొంతూళ్లకు ప్రయాణమయ్యే వారికి ఇది అనుభవైకవేద్యమే. అయితే ఈ సారి ఈ ఇబ్బంది లేకుండా చేయడానికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లిపోయేందుకు వీలు కల్పించేలా వాహనాల టోల్‌చార్జీలను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ మేరకు నిర్ణయం అయితే తీసేసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ నిర్ణయానికి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని  కోరినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఈ నిర్ణయాన్ని అములు చేయడానికి సర్కార్ రెడీగా ఉంది.  

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, విజయవాడవైపు వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఉరట కలుగుతుందనడంలో సందేహం లేదు.  ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర హైవేలన్నింటితో పోలిస్తే.. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65పై  రాష్ట్ర పరిధిలో ఉన్న పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుందిద. ఈ నేపథ్యంలోనే.. పండగ వేళ హైవేలపై ట్రాఫిక్‌ జామ్‌లకు స్వస్తి పలికి, ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. కాబట్టి.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల టోల్‌చార్జీలను తామే చెల్లిస్తామని., అందుకు అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసినట్లు తెలిసింది.

మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్

  కొత్త సంవత్సర వేడుకలు దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 31న మెట్రోరైలు వేళలను పొడిగించారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రారంభ స్టేషన్‌ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నాయి. మెట్రో రైలు ప్రయాణీకులు దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ జర్నీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో రాత్రి 11 గంటలకు మెట్రో రైలు అందుబాటులో ఉంటాయి.  మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా నగరంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుందని.. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు   

పాలమూరు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌పై ఏసీబీ కస్టడీ పిటిషన్

  మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టు అయిన కిషన్‌ను ఏడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిం చాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, కిషన్ తన విధి నిర్వహణలో  ఆదాయానికి మించిన భారీ ఆస్తులను సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.  ఈ నేపథ్యంలోనే ఆయన నివాసాలు, కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తులకు సంబం ధించిన వివరాలు, బ్యాంకు లావాదేవీల ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా పలు అంశాలపై లోతైన విచారణ అవసరమని ఏసీబీ అధికారులు పేర్కొంది. అక్రమంగా సంపాదించిన ఆస్తుల మూలాలు, వాటిలో భాగస్వాముల పాత్ర, బినామీ లావాదేవీల కోణం, ఇతర అధికారులతో ఉన్న సంబంధాలపై స్పష్టత కోసం కస్టడీ అవసరమని ఎసిబి అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌లో వివరించారు.  ఈ కారణంగానే కిషన్‌ను ఏడు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. అంతేకాకుండాఈ కేసులో కీలకంగా భావిస్తున్న పలువురు వ్యక్తులను విచారించాల్సి ఉండటంతో పాటు, మరిన్ని డాక్యు మెంట్లు సేకరించాల్సిన అవసరం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. కస్టడీ లభిస్తే ఈ దర్యాప్తు మరింత వేగంగా, సమగ్రంగా సాగుతుందని వారు భావిస్తు న్నారు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై రేపు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. కోర్టు తీసుకునే నిర్ణయంతో కేసు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితురాలు అరెస్ట్

  గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంజారాహిల్స్‌కు చెందిన హస్సా అనే మహిళను  తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి MDMA మరియు LSD బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్ నెం.3, గెలాక్సీ మొబైల్ షాప్ సమీపంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో. ఆమెను విచారించగా, మాదకద్రవ్యాల వినియో గానికి సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హస్సాను అరెస్టు చేసిన అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెత్ మరియు ఆంఫెటమైన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.  దీంతో ఆమె కేవలం వినియోగదారురాలే కాకుండా, డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో హస్సా చెప్పిన విషయాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. హస్సా డిసెంబర్ 2024లో బస్సులో గోవాకు వెళ్ళానని, అక్కడ హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన మీనా మరియు ఆమె స్నేహితుడు కిరణ్‌ను కలిసినట్లు వెల్లడించింది. గోవాలోని మెర్మైడ్ హోటల్‌లో కలిసి బస చేసి, వాగేటర్ బీచ్, వాగేటర్ క్లబ్‌లకు వెళ్లినట్లు తెలిపింది. అక్కడే, మీనా ద్వారా సియోలిమ్ (గోవా)కు చెందిన రోమి భరత్ కళ్యాణి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది.  ఆ సమయంలో రోమి ఇచ్చిన పసుపు రంగు పొడిని డ్రగ్‌గా వినియోగించినట్లు అంగీకరించింది. డిసెంబర్ 2025లో జరిగిన పర్యటనల్లో కూడా రోమి లేదా అతని మధ్యవర్తుల ద్వారా డ్రగ్స్ లావాదేవీలు జరిగినట్లుగా హస్సా పోలీసులకు వివరించింది.డిసెంబర్ 26, 2025న, సియోలిమ్ మరియు అనంతరం మాపుసాలో రోమి వ్యక్తిగతంగా కలసి MDMA మరియు LSD బ్లాట్స్‌ను అందించినట్లు హస్సా తెలిపింది. కొన్నిసార్లు హైదరాబాద్‌కు చెందిన సుమిహా ఖాన్, వజీర్ బాక్సర్ వంటి పరిచయస్తులతో కలిసి డ్రగ్స్ వినియోగించినట్లు కూడా హస్సా అంగీకరించింది.

తెలంగాణలో 2.33% క్రైమ్ రేట్ తగ్గింది : డీజీపీ శివధర్ రెడ్డి

  తెలంగాణలో 3 శాతం సైబర్ నేరాలు తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోలీస్తే 2.33% క్రైమ్ రేట్ తగ్గిందని డీజీపీ తెలిపారు. మంగళవారం నాడు 2025 వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.  ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు.  మూడు విడతలు గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా  నిష్పక్షపాతంగా జరిగేలా కాపాడామని డీజీపీ అన్నారు. ఈ ఏడాది 2.28 లక్షలు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో 4 కేసులో మరణ శిక్షలు ఖరారు అయ్యాయని.. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పండిందని తెలిపారు. ఫోక్సో కేసుల్లో 144 కేసుల్లో 154 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని.. అందులో ముగ్గురికి మరణ శిక్ష, 48 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాయని డీజీపీ తెలిపారు.  

ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

  ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై  దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల పాయింట్లను సవాలు చేస్తూ పలువురు అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. 2023లో ఇచ్చిన గ్రూప్-2 నోటీఫికేషన్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శికాలను అనుగుణంగా సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.  ఈ మేరకు ఆ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పాత నోటిఫికేషన్‌కు బదులు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరారు. రిజర్వేషన్ల పాయింట్లను సవాల్ చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, రిజర్వేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది.  

హైదరాబాద్‌లో జింక మాంసం విక్రయిస్తూ.. పోలీసులకు చిక్కిన నిందితుడు

  అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఓ వన్యప్రాణిని చంపి దాని మాంసాన్ని విక్రయించి డబ్బులు సంపాదించాలని ఓ కేటుగాడు చేసిన ప్రయత్నాన్ని రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు.. రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందానికి వన్యప్రాణిని చంపి దాని మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గా విశ్వసనీయమైన సమాచారం రావడంతో అత్తాపూర్ పరిధిలోని సులేమాన్‌నగర్ ప్రాంతంలో ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ ఘటనలో సులేమాన్‌ నగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ ఉద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 15 కిలోల జింక మాంసం, మూడు కత్తులు ఒక సెల్ ఫోన్‌తో పాటు అక్రమ విక్రయాల ద్వారా వచ్చినట్లు అను మానిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అడవుల్లో అక్రమంగా జింకలను వేటాడి, దాని మాంసాన్ని పట్టణ ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కొంతకాలంగా అత్తాపూర్ మరియు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా వన్యప్రాణుల మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అత్తాపూర్ పరిధిలో నిఘా పెట్టారు. అనుమానాస్పదం గా తిరుగుతున్న నిందితుడి పై నిఘా పెట్టి, సరైన సమయం కోసం వేచి చూశారు. నిందితుడు ఇతరులకు జింక మాంసాన్ని విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు...  ఎస్ఓటి బృందం నిందితుడిని మరియు స్వాధీనం చేసుకున్న మాంసాన్ని నగదును తదుపరి విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. అత్తాపూర్ పోలీసులు  వన్యప్రాణుల సంరక్షణ చట్టం (వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఈ అక్రమ వేటలో మరెవరైనా సహకరించారా? మాంసాన్ని ఎవరికి విక్రయిస్తున్నాడు? అనే కోణాల్లో పోలీసులు లోతైన విచారణ కొనసా గిస్తున్నారు.అడవిజంతువుల అక్రమ వేట, మాంసం విక్రయం వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుం టామని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.  

లంకతో టి20 సిరీస్‌.. క్లీన్‌స్వీప్‌పై భారత్ మహిళా క్రికెటర్ల ఫోకస్

శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో నాలుగు వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌తో.. ఈ ఏడాదికి గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పాలనుకొంటోంది. అయితే, ప్రత్యర్థి శ్రీలంక మంగళవారం జరిగే ఆఖరి, ఐదో టీ20లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత వరల్డ్‌కప్‌ సన్నాహకాల కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటించనుంది.  2024 టీ20 వరల్డ్‌కప్  లో గ్రూప్‌దశలోనే భారత్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే   హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్ తమ పంథాను మార్చుకొని దూకుడుగా ఆడుతూ  అన్ని జట్లకూ బలమైన ప్రత్యర్థిగా మారింది. ఈ సిరీస్‌లో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో.. తొలి మూడు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా పోయింది.  భారత్ ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతంగా రాణిస్తోంది. అయితే, భారత ఫీల్డింగ్‌  మాత్రం ఇంకా ఉన్నత ప్రమాణాలను అందుకోలేక పోవడం  ఆందోళనకరం. నాలుగో టీ20లో కూడా రెండు క్యాచ్‌లతోపాటు ఓ స్టంపింగ్‌ అవకాశాన్ని చేజార్చారు. కాగా, ఏడాది తర్వాత పేసర్‌ రేణుక సింగ్‌ పొట్టి ఫార్మాట్‌లోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వడం సానుకూలాంశం. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ నిలకడగా రాణిస్తుండగా.. ఈ సిరీస్ లో అరంగేట్రం చేసిన స్పిన్నర్‌ వైష్ణవి శర్మ ఆకట్టుకొంది. డాషింగ్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన (48 బంతుల్లో 80) టచ్‌లోకి రావడంతో ఇండియా బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. వన్‌డౌన్‌కు ప్రమోట్‌ అయిన రిచా ఘోష్‌ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకుంది. జ్వరంతో బాధపడుతున్న జెమీమా రోడ్రిగ్స్‌ ఫిట్‌నెస్ పై ఎటువంటి సమాచారం లేదు. జట్టులోని అందరికీ అవకాశాలు లభించడంతో ఇక మిగిలిన 17 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమలి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. గత మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయిన లంక.. నాలుగో మ్యాచ్‌లో ఛేదనలో దీటుగానే నిలిచింది. ఇదే ఆత్మవిశ్వాసంతో ఈ సిరిస్ ను  విజయంతో ముగించాలని చమరి ఆటపట్టు సేన పట్టుదలతో ఉంది.వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండడంతో టాస్‌ గెలిచిన టీమ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో ఇక 28 జిల్లాలు... పునర్‌వ్యవస్థీకరణ పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తైంది. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తారు. మదనపల్లె పేరుతో జిల్లా ఉండదు. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుంది. ప్రస్తుతమున్న అన్నమయ్య జిల్లా మూడు ముక్కలైంది. జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతారు. మిగిలిన రాయచోటిని అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గతనెల 27న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.  కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటులో ఎలాంటి మార్పులు లేవు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించనుంది. రెవెన్యూ శాఖ కొత్తగా 2 జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, రెండు మండలాలు, ఇంకా కొన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలి నోటిఫికేషన్‌లో 5రెవెన్యూ డివిజన్లు ప్రకాశం జిల్లాలోని అద్దంకి, మడకశిర (సత్యసాయి), బనగానపల్లె (నంద్యాల), పీలేరు (మదనపల్లె), నక్కపల్లి (అనకాపల్లి) ప్రతిపాదించారు. అయితే నక్కపల్లికి బదులు అడ్డరోడ్డు జంక్షన్‌ను డివిజన్‌గా  ప్రతిపాదనను మార్చారు. ఇక అన్నమయ్య జిల్లా పేరు  కొనసాగుతుంది  కానీ స్వరూపమే మారనుంది. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లె కేంద్రంగా ఉంటుంది. కానీ అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేస్తారు. అన్నమయ్యలో రాయచోటి కొనసాగుతుంది. పలమనేరు డివిజన్‌లో ఉన్న చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లె డివిజన్‌లో విలీనం చేస్తారు. పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె మండలాలను రాయచోటి డివిజన్‌ నుంచి తీసి కొత్తగా ఏర్పాటు చేసే పీలేరు డివిజన్‌లో కలుపుతారు. చిట్టమూరు, వాకాడ మండలాలను తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట డివిజన్‌లోనే కొనసాగిస్తారు. రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోని కో డూరు, పెంగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేసి తిరుపతి రెవెన్యూడివిజన్‌లో కలుపుతారు. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూ రు డివిజన్‌లోని గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను నెల్లూరు జిల్లాలో కలుపుతారు. ప్రాథమిక నోటిఫికేషన్‌ ప్రకారం నెల్లూరు జిల్లాలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ మూడు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తారు. కలువాయిని ఆత్మకూరులో, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు డివిజన్‌లో కొనసాగిస్తారు. కందుకూరు డివిజన్‌లోని వరికుంటపాడు, కొండాపురం మండలాలను నెల్లూరు జిల్లా కావలి డివిజన్‌లో విలీనం చేస్తారు. రాజంపేట డివిజన్‌తో పాటు నందలూరు, వీరబల్లె, టి. సుండుపల్లె మండలాలను కడప జిల్లాలో విలీనం చేస్తారు. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడపలోనే కొనసాగిస్తారు. కనిగిరి డివిజన్‌లో ఉన్న దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలు అద్దంకి డివిజన్‌ లో ఉంటాయి. అద్దంకిని ప్రకాశంలోకి తీసుకొచ్చి కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ తొలి నోటిఫికేషన్‌ ఇచ్చారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు దీన్ని మార్చారు. పెద్ద హరివనం మండలం ఉండదు. దాని స్థానంలో ఆదోని-2 మండలం ఉంటుంది.

జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు కమిషనరేట్ల

హైదరాబాద్ మహానగరంలో  పోలీస్ పరిపాలనను మరింత పటిష్టంగా, సమర్ధవంతంగా మార్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లకు అదనంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. ఇక నుంచి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ప్యూచర్ షిటీగా నాలుగు కమిషనరేట్లు ఉంలాయి. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 29) రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే   అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేక పోలీస్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ఎస్పీని నియమించింది.  తాజా ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో  అసెంబ్లీ, సెక్రటేరియట్, నగర వాణిజ్య కేంద్రంగా ఉన్న బేగంపేట, అంతర్జాతీయ రవాణాకు ముఖ్యమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, న్యాయ వ్యవస్థకు కేంద్రంగా ఉన్న బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత కీలక ప్రాంతాలు వచ్చాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, చట్ట పరిరక్షణ మరింత పటిష్టంగా మారనుంది. ఇక సైబరాబాద్ కమిషనరేట్‌కు ఐటీ, పారిశ్రామిక హబ్‌లు, ఐటీ కారిడార్ ప్రాంతాలైన బౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గలు వచ్చాయి.  అలాగే పరిశ్రమల కేంద్రాలైన పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీ పురం, అమీన్‌పూర్ వంటి ప్రాంతా లను కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కి తీసుకువచ్చారు. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాచకొండ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరించి దాని పేరును మల్కాజ్ గిరి కమిషనరేట్ గా మార్చారు. తొలుత మహంకాళి లేదా లష్కర్ కమిషనరేట్ అన్న పేరును తీవ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు మల్కాజ్ గిరి కమిషనరేట్ గా నిర్ణయించింది.  ఈ కమిషనరేట్ పరిధిలో కీసర, శామీర్‌పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లితో పాటు ఉత్తర హైదరాబాద్‌కు చెందిన పలు  ప్రాంతాలు చేరనున్నాయి. వేగంగా పెరుగుతున్న నివాస ప్రాంతాలకు అనుగుణంగా పోలీస్ సేవలను మరింత దగ్గరగా తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే భవిష్యత్ లో అభివృద్ధి కేంద్రంగా మారనున్న ప్రాంతాల కోసం ప్రభుత్వం  ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ కమిషనరేట్ పరిధిలోకి చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు వచ్చాయి.  భవిష్యత్‌లో పెద్ద ఎత్తున పారిశ్రామిక, వాణిజ్య, నివాస అభివృద్ధి జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ప్రణాళికగా ఈ కమిషనరేట్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.  ఇక పోతే యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి, అక్కడ ప్రత్యేకంగా  ఎస్పీ ని నియమించింది. ఆలయ ప్రాంతం కావడం, ప్రజా రద్దీ అధికంగా ఉండటంతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ అవసరమన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది.  

తెలంగాణ పోలీస్ శాఖలో కీలక బదిలీలు

తెలంగాణ పోలీస్ శాఖలో విస్తృత పునర్వ్యవస్థీకరణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదలీ చేసింది. అలాగే పోస్టింగ్‌లను ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన పోలీస్ కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. సుధీర్ బాబును కొత్తగా ఏర్పాటు చేసిన  ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు పోలీస్ కమిషనర్‌గా నియమించింది.   అలాగే  సైబరా బాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న  అవినాష్ మొహంతిని  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పున ర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు  కమిషనర్‌గా నియమించింది. ఇక పోతే .ఇక, ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్), పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఐజీపీ (స్పోర్ట్స్) బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. రమేష్   సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు  కమిషనర్‌గా నియమించింది.  అదే విధంగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న  అక్షాన్స్ యాదవ్, ఐపీఎస్ (2019 బ్యాచ్) ను  నియమించింది.