తెలంగాణ పోలీస్ శాఖలో కీలక బదిలీలు

తెలంగాణ పోలీస్ శాఖలో విస్తృత పునర్వ్యవస్థీకరణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదలీ చేసింది. అలాగే పోస్టింగ్‌లను ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన పోలీస్ కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. సుధీర్ బాబును కొత్తగా ఏర్పాటు చేసిన  ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు పోలీస్ కమిషనర్‌గా నియమించింది.  

అలాగే  సైబరా బాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న  అవినాష్ మొహంతిని  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పున ర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు  కమిషనర్‌గా నియమించింది. ఇక పోతే .ఇక, ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్), పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఐజీపీ (స్పోర్ట్స్) బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. రమేష్   సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు  కమిషనర్‌గా నియమించింది.  అదే విధంగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న  అక్షాన్స్ యాదవ్, ఐపీఎస్ (2019 బ్యాచ్) ను  నియమించింది. 

ఏపీలో ఇక 28 జిల్లాలు... పునర్‌వ్యవస్థీకరణ పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తైంది. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలతో పాటు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తారు. మదనపల్లె పేరుతో జిల్లా ఉండదు. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుంది. ప్రస్తుతమున్న అన్నమయ్య జిల్లా మూడు ముక్కలైంది. జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతారు. మిగిలిన రాయచోటిని అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గతనెల 27న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.  కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటులో ఎలాంటి మార్పులు లేవు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించనుంది. రెవెన్యూ శాఖ కొత్తగా 2 జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, రెండు మండలాలు, ఇంకా కొన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలి నోటిఫికేషన్‌లో 5రెవెన్యూ డివిజన్లు ప్రకాశం జిల్లాలోని అద్దంకి, మడకశిర (సత్యసాయి), బనగానపల్లె (నంద్యాల), పీలేరు (మదనపల్లె), నక్కపల్లి (అనకాపల్లి) ప్రతిపాదించారు. అయితే నక్కపల్లికి బదులు అడ్డరోడ్డు జంక్షన్‌ను డివిజన్‌గా  ప్రతిపాదనను మార్చారు. ఇక అన్నమయ్య జిల్లా పేరు  కొనసాగుతుంది  కానీ స్వరూపమే మారనుంది. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా ఇక మదనపల్లె కేంద్రంగా ఉంటుంది. కానీ అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేస్తారు. అన్నమయ్యలో రాయచోటి కొనసాగుతుంది. పలమనేరు డివిజన్‌లో ఉన్న చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లె డివిజన్‌లో విలీనం చేస్తారు. పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె మండలాలను రాయచోటి డివిజన్‌ నుంచి తీసి కొత్తగా ఏర్పాటు చేసే పీలేరు డివిజన్‌లో కలుపుతారు. చిట్టమూరు, వాకాడ మండలాలను తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట డివిజన్‌లోనే కొనసాగిస్తారు. రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోని కో డూరు, పెంగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేసి తిరుపతి రెవెన్యూడివిజన్‌లో కలుపుతారు. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూ రు డివిజన్‌లోని గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను నెల్లూరు జిల్లాలో కలుపుతారు. ప్రాథమిక నోటిఫికేషన్‌ ప్రకారం నెల్లూరు జిల్లాలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ మూడు మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తారు. కలువాయిని ఆత్మకూరులో, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు డివిజన్‌లో కొనసాగిస్తారు. కందుకూరు డివిజన్‌లోని వరికుంటపాడు, కొండాపురం మండలాలను నెల్లూరు జిల్లా కావలి డివిజన్‌లో విలీనం చేస్తారు. రాజంపేట డివిజన్‌తో పాటు నందలూరు, వీరబల్లె, టి. సుండుపల్లె మండలాలను కడప జిల్లాలో విలీనం చేస్తారు. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడపలోనే కొనసాగిస్తారు. కనిగిరి డివిజన్‌లో ఉన్న దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలు అద్దంకి డివిజన్‌ లో ఉంటాయి. అద్దంకిని ప్రకాశంలోకి తీసుకొచ్చి కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తారు. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ తొలి నోటిఫికేషన్‌ ఇచ్చారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు దీన్ని మార్చారు. పెద్ద హరివనం మండలం ఉండదు. దాని స్థానంలో ఆదోని-2 మండలం ఉంటుంది.

జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు కమిషనరేట్ల

హైదరాబాద్ మహానగరంలో  పోలీస్ పరిపాలనను మరింత పటిష్టంగా, సమర్ధవంతంగా మార్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లకు అదనంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. ఇక నుంచి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ప్యూచర్ షిటీగా నాలుగు కమిషనరేట్లు ఉంలాయి. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 29) రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే   అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేక పోలీస్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ఎస్పీని నియమించింది.  తాజా ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో  అసెంబ్లీ, సెక్రటేరియట్, నగర వాణిజ్య కేంద్రంగా ఉన్న బేగంపేట, అంతర్జాతీయ రవాణాకు ముఖ్యమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, న్యాయ వ్యవస్థకు కేంద్రంగా ఉన్న బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత కీలక ప్రాంతాలు వచ్చాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, చట్ట పరిరక్షణ మరింత పటిష్టంగా మారనుంది. ఇక సైబరాబాద్ కమిషనరేట్‌కు ఐటీ, పారిశ్రామిక హబ్‌లు, ఐటీ కారిడార్ ప్రాంతాలైన బౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గలు వచ్చాయి.  అలాగే పరిశ్రమల కేంద్రాలైన పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీ పురం, అమీన్‌పూర్ వంటి ప్రాంతా లను కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కి తీసుకువచ్చారు. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాచకొండ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరించి దాని పేరును మల్కాజ్ గిరి కమిషనరేట్ గా మార్చారు. తొలుత మహంకాళి లేదా లష్కర్ కమిషనరేట్ అన్న పేరును తీవ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు మల్కాజ్ గిరి కమిషనరేట్ గా నిర్ణయించింది.  ఈ కమిషనరేట్ పరిధిలో కీసర, శామీర్‌పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లితో పాటు ఉత్తర హైదరాబాద్‌కు చెందిన పలు  ప్రాంతాలు చేరనున్నాయి. వేగంగా పెరుగుతున్న నివాస ప్రాంతాలకు అనుగుణంగా పోలీస్ సేవలను మరింత దగ్గరగా తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే భవిష్యత్ లో అభివృద్ధి కేంద్రంగా మారనున్న ప్రాంతాల కోసం ప్రభుత్వం  ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ కమిషనరేట్ పరిధిలోకి చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు వచ్చాయి.  భవిష్యత్‌లో పెద్ద ఎత్తున పారిశ్రామిక, వాణిజ్య, నివాస అభివృద్ధి జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ప్రణాళికగా ఈ కమిషనరేట్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.  ఇక పోతే యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి, అక్కడ ప్రత్యేకంగా  ఎస్పీ ని నియమించింది. ఆలయ ప్రాంతం కావడం, ప్రజా రద్దీ అధికంగా ఉండటంతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ అవసరమన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది.  

పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ..కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

దేశంలోనే అతి పెద్ద నగరంగా ఆవిర్భవించనున్న హైదరాబాద్ మహానగరంలో పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 29) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.  పాలనా సౌలభ్యం లక్ష్యంగా  జీహెచ్‌ఎంసీ పరిధికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్ల సర్వరూపం, సరిహద్దులను మార్చింది. ట్యాంక్‌బండ్ నుంచి శంషాబాద్ వరకు హైదరాబాద్ కమిషనరేట్  ఏర్పాటు చేసింది.   సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణపై హోం శాఖ, డీజీపీ, ముగ్గురు కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారు పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి చేసిన తుది ప్రతిపాదనలకు సర్కార్ ఓకే చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు  జీహెచ్‌ఎంసీ వార్డులు, సర్కిళ్లు, జోన్ల ఆధారంగానే పోలీస్ స్టేషన్లు, డివిజన్లు, జోన్ల ఉంటాయి.    ప్రస్తుతం మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న 16 పోలీస్ జోన్లను, జీహెచ్‌ఎంసీ జోన్లకు అనుగుణంగా 12కు కుదించారు.    ప్రస్తుతం రాచకొండ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జోన్‌ను తొలగించి  దానిని ప్రత్యేక జిల్లా ఎస్పీ పరిధిలోకి తీసుకువచ్చారు.   ఈ పునర్వ్యవస్థీకరణతో, కమిషనరేట్ల పరిధులు  మారిపోయాయి.   శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఉన్న పోలీస్ స్టేషన్లను   హైదరాబాద్ కమిషనరేట్‌ విలీనమయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పేరును  మహంకాళి లేదా  లష్కర్ కమిషనరేట్ గా మార్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.   సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు ప్రాంతంలోని కొన్ని పోలీస్ స్టేషన్లను సైబరాబాద్‌లో విలీనం అయ్యాయి. క మరోవైపు ట్యాంక్‌బండ్‌ నుంచి ప్రస్తుతం ఉన్న కొన్ని ఠాణాలతో పాటు సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలోని పలు పోలీస్‌ స్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌లో కలిపింది. ముఖ్యంగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఉన్న పోలీస్‌ స్టేషన్లను హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఆదిభట్ల‌, సనత్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్‌, బాలాపూర్‌ తదితర ఠాణాలు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో విలీనం అవుతాయి. ఈ మూడుకమిషనరేట్ లకు అదనంగా గా ఫ్యూచర్ సిటి కమిషనరేట్ ను ఏర్పాటు చేసి.. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించింది.  

ముక్కోటి ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలన్నీ భక్తజనకోటితో కిక్కిరిసిపోయాయి. దేవాలయాలతో వైకుంఠ ద్వార దర్శనాలకు అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు.  తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం (డిసెంబర్ 29) అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి అంటే  12గంటలు దాటిన తరువాత నుంచీ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించారు.  వేకువజామున 1.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను  ఉత్తర ద్వార దర్శనం ద్వారాదర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిచ్చారు.  అలాగే చిన్న తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన  ద్వారకా తిరుమలలో ఈ తెల్లవారు జామునుంచే ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం ఐదున్నర నుంచి శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు అనుమతించారు.  భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.   ఇక సింహాచలంలో  శ్రీవరాహా లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.   అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రసిద్ధ ఆలయాలలోనూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దేవదేవుడిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు.  అదే విధంగా తెలంగాణలోని అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిటకిట లాడు తున్నాయి.  రాష్ట్రంలోని   భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవాలయాలూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కన్నుమూత

బంగ్లాదేశ్  తొలి మహిళా ప్రధానని బేగం ఖలీదా జియా మంగళవారం డిసెంబర్ 30) కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లు. గత కొంత కాలంగా   అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బేగం ఖలీదా జియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.    కాలేయ వ్యాధి, కీళ్ల నొప్పులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షిణించడంతో గత కొంత కాలంగా ఆమె ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు.   బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ భార్య అయిన ఖలీదా జియా.. తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి అజేయ శక్తిగా ఎదిగారు. బంగ్లాదేశ్ ప్రధానిగా మూడు సార్లు  బాధ్యతలు చేపట్టిన ఆమె, ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విశేషంగా కృషి చేశారు.  ఆమె మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.   ఖలీదా మరణించిన సమయంలో ఆమె కుమారుడు, బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్, కోడలు జుబైదా రెహమాన్, మనవరాలు జైమా రెహమాన్, పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. బేగం ఖలీదా జియాకు ఇండయాతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె జన్మించినది ఇండియాలోనే.   1947లో దేశ విభజన  తర్వాత ఆమె కుటుంబం ప్రస్తుత బంగ్లాదేశ్ కు వలస వెళ్లింది.   1991లో బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదా జియా చరిత్ర సృష్టించారు. ముస్లిం ప్రపంచంలో బెనజీర్ భుట్టో తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.  మూడు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రధానిగా పనిచేసిన ఆమె ఆ దేశ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. బేగం ఖలీదా జియా మృతిపట్ల భారత ప్రధాని నరేంద్రమోడీ సహా, పలు దేశాల అధినేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీ రేపు శ్రీవారిని దర్మించుకోనుంది. రేణిగుంట విమానశ్రయంలో ఆయనకు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావులకేశవ్ స్వాగతం పలికారు.  సీఎం సతీమణి, అల్లుడు, కూతురు మనుమడిని ఆప్యాయంగా పలుకరించారు.  గాయత్రి గెస్ట్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంత్రులతో  కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుని, పద్మావతి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారు. రేపు తెల్లవారుజామున వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకుని, అనంతరం రాత్రికి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్

  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేత మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించినందుకు ఎన్నిక రద్దు చేయాలని కోర్టును కోరారు.. తనపై ఉన్న 7 క్రిమినల్ కేసులను నవీన్ యాదవ్ వెల్లడించలేదని పేర్కొన్నాది. ప్రచారంలోనూ నవీన్ యాదవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రి పరిశీలనలో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ..‌ 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ (నవీన్ యాదవ్)కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ (మాగంటి సునీత) 74,259 ఓట్లు, బీజేపీ (దీపక్ రెడ్డి)కు 17,061 ఓట్లు వచ్చాయి.

రాయచోటిలో నిరసన జ్వాలలు...మూకుమ్మడి రాజీనామాలు

  అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడంపై రాయచోటిలో నిరసన జ్వాలలు రగిలాయి. ర్యాలీలతో పాటు పలువురు పదవులకు రాజీనామాలు చేశారు. మూడున్నరెఏళ్ళుగా జిల్లా కేంద్రంగా ఉండి పలు భవనాలకు స్థలాలు, నిధులు సమకూర్చుకొని ,జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని పరిపారన సాగుతున్న తరుణంలో ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చడం ఇక్కడి ప్రజలకు అన్యాయం చేయడమే‌నన్నారు. రాయచోటిపై రాజకీయ కక్ష సాధించవద్దని కోరుతూ  కొందరు పదవులకు రాజీనామా చేస్తూ మాట్లాడారు.  జిల్లా కేంద్రాన్ని మార్పు చేయడం ద్వారా రాయచోటి వాసులకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ప్రజాధనం కూడా వృధా అవుతుందని, ఇప్పటికైనా జిల్లా కేంద్రాన్ని మార్చకుండా  రాయచోటి లోనే కొనసాగించాలని ఆందోళన వ్యక్తం చేశారు. మహా ర్యాలీ రాయచోటి జిల్లా కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ పట్టణంలోని శివాలయం చెక్ పోస్ట్ నుంచి నేతాజీ సర్కిల్, జామియా మసీదు సర్కిల్, గాంధీ బజార్, వైయస్సార్ సర్కిల్ ల మీదుగా బంగ్లా సర్కిల్ వరకు మహా ర్యాలీ చేశారు. మదనపల్లి వద్దు రాయచోటి ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. *రాజీనామాలు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగింపు నిరసనగా రాయచోటిలో మొదలైన రాజీనామాల పర్వం మొదలైంది. రాయచోటి పట్టణంలో 22వ వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులకు  పోలంరెడ్డి దశరథ రామిరెడ్డి,  అయిదవ వార్డు కౌన్సిలర్ పోలంరెడ్డి విజయమ్మ లు రాజీనామా చేశారు. జిల్లా కేంద్రం రాయచోటిని మార్పుకు నిరసనగా పలువురు కౌన్సిలర్లు రాజీనామా చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని వెనుకబడిన రాయచోటికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరొకసారి తమ నిర్ణయాన్ని పునరాలోచిన చేసుకోవాలని కూటమి ప్రభుత్వానికి కౌన్సిలర్ లు విజ్ఞప్తి చేశారు.  

పిన్నమనేని సాయిబాబు మృతి టీడీపీకి తీరని లోటు : నందమూరి రామకృష్ణ

  సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా, వికలాంగుల సంస్థ మాజీ  చైర్మన్‌  పిన్నమనేని సాయిబాబు  ఆకస్మిక మృతి పట్ల టీడీపీ నేత నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు. నిన్న తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అకస్మాత్తుగా మృతి చెందడం అభిమానులు, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. సాయిబాబు మృతి యావత్ తెలుగుదేశం పార్టీ వీరసైన్య కార్యకర్తలను, ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది.  ఆయన మరణం అటు అభిమానులకు, ఇటు పార్టీ కార్యకర్తలకు తీరని లోటుగా మారింది. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్ల నుంచే పసుపు జెండాను భుజాన మోసిన మొట్టమొదటి వీరసైన్య కార్యకర్తలలో సాయిబాబు ఒకరు. ఎన్నో కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుండి పార్టీని నడిపించారు. ఒక నిబద్ధమైన అభిమానిగా, అంకితభావంతో కూడిన కార్యకర్తగా ఎన్టీఆర్‌కు, తెలుగుదేశం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివి. పిన్నమనేని సాయిబాబుకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున, మా కుటుంబం తరఫున ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. పసుపు కార్యకర్తలు, అభిమానుల హృదయాల్లో సాయిబాబు జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయిని రామకృష్ణ తెలిపారు.  

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

  వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలలో రేపటి నుంచి ప్రారంభం కానున్న  వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. టీటీడీ  సీవీఎస్వో, జిల్లా ఎస్పీ, చీఫ్‌ ఇంజినీర్‌, పలు విభాగాల అధికారులు టీటీడీ ఛైర్మన్ వెంట ఉన్నారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్‌ క్యూలైన్‌ ఎంట్రీ పాయింట్స్ వద్ద క్షేత్రస్థాయిలో సదుపాయాలను వారు పరిశీలించారు.  వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి డిసెంబర్‌ 30, 31, జనవరి 1 తేదీల్లో 1.89 లక్షల టోకెన్లను ఈ-డిప్ ద్వారా టీటీడీ కేటాయించింది. టోకెన్లు ఉన్న భక్తులకే ఆ మూడు రోజుల్లో దర్శనం కల్పించనున్నారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద టోకెన్ స్కానింగ్ ప్రక్రియను ఛైర్మన్‌కు అధికారులు వివరించారు.  క్యూలైన్ ఎంట్రీ వద్ద భక్తులకు కల్పించి సదుపాయాలను ఆయన తనిఖీ చేశారు. టోకెన్లు ఉన్న భక్తులకే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు