నిర్భయ దోషుల ఉరి తేదీ ఖరారు.. దారులన్నీ మూసుకుపోయినట్టే!

నిర్భయ దోషులకు న్యాయపరంగా, చట్టపరంగా లభించిన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. చివరిగా పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ ను కూడా రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దాంతో, నలుగురు దోషుల ఉరికి తాజాగా డెత్ వారెంట్లు జారీ చేసింది ఢిల్లీ కోర్టు. మార్చి 20న ఉదయం 6గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలంటూ పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష వాయిదా పడటం, దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు ముగిసిపోవడంపై ఇక, ఉరిశిక్ష అమలుకు ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని అంటున్నారు. దాంతో, ఈసారి ఉరి అమలు ఖాయంగా కనిపిస్తోంది.  

అయితే, దోషులు నలుగురినీ, ఒకే ఉరికంబంపై... ఒకేసారి ఉరితీయనున్నారు. ఉరిశిక్ష అమలు కోసం తీహార్ జైలు అధికారులు ఇఫ్పటికే ఎన్నోసార్లు ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. నిర్భయ దోషుల కోసం ప్రత్యేకంగా సిద్ధంచేసిన ఉరికంబంపై ఉరితీయనున్నారు. నలుగురినీ ఒకేసారి ఉరితీసేందుకు అనుగుణంగా తీహార్ జైల్లో ఏర్పాట్లు చేశారు. అలాగే, ఉరి తీసిన తర్వాత అక్నడ్నుంచి మృతదేహాలను తరలించేందుకు అండర్ గ్రౌండ్ మార్గాన్ని నిర్మించారు. ఇక, భారత్‌లో ఇప్పటివరకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే ఉరితీసిన సందర్భాలుండగా... మొదటిసారి నలుగురినీ ఒకే ఉరికంబంపై ...ఒకే సమయంలో ఉరి తీయబోతున్న జైలుగా తీహార్ కారాగారం రికార్డులకెక్కబోతోంది.

Teluguone gnews banner