నైజీరియా మిలిటెంట్లకి ఓ కన్య హాట్ ఆఫర్
posted on Jun 28, 2014 @ 3:48PM
నైజీరియాలో ఇస్లామిక్ మిలిటెంట్లు ఈమధ్యకాలంలో 276 మంది స్కూళ్ళలో చదువుకునే అమ్మాయిలను కిడ్నాప్ చేశారు. ముస్లిం అమ్మాయిలు చదువుకోకూడదన్నది ఇస్లామిక్ తీవ్రవాదుల సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా స్కూలుకు వెళ్తున్న అమ్మాయిలను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. కిడ్నాప్‌కి గురైన అమ్మాయిలను తీవ్రవాదుల చెర నుంచి విడిపించడానికి నైజీరియా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అమ్మాయిలను విడిచిపెట్టాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్ హాలీవుడ్ తారలతో కలసి విజ్ఞప్తి చేసినా తీవ్రవాదుల మనసు కరుగలేదు. ఈ నేపథ్యంలో నైజీరియా పాప్ గాయని అడోకియేను రంగంలోకి దిగింది. తీవ్రవాదులు స్కూలు అమ్మాయిలను విడుదల చేస్తే దానికి బదులుగా తన కన్యత్వాన్ని అర్పించడానికి సిద్ధంగా వున్నానని ప్రకటించి సంచలనం సృష్టించింది. తీవ్రవాదులు తమ దగ్గర బందీలుగా వున్న అమ్మాయిలందర్నీ విడిచిపెట్టి, వారికి బదులుగా తనను అదుపులోకి తీసుకోవచ్చని, తను ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌కి తీవ్రవాదుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోయినప్పటికీ, ఆమె చేసిన ప్రతిపాదన మాత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.