గెయిల్ పేలుడు: మురళీమోహన్‌కి కోపమొచ్చింది!
posted on Jun 28, 2014 @ 2:08PM
నగరం గ్యాస్ పైపులైన్ దుర్ఘటన అందరికీ కదిలించింది. ఈ దుర్ఘటనలో 16 మంది మరణించగా అనేకమంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. పేలుడు బాధితులను పరామర్శించేందుకు అనేకమంది నాయకులు వస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి వచ్చిన సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ని కొంతమంది బాధితుల తాలూకు వ్యక్తులు చుట్టుముట్టి ఆయన మీద ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఆందోళన చేశారు. తమకు ఎలాంటి సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, చుట్టపుచూపుగా వచ్చి పలకరించినంత మాత్రాన ఏమీ అయిపోదని మురళీమోహన్ను నిలదీశారు. సహజంగా మృదుస్వభావి అని, ఎవరిమీదా కోపగించుకోరని పేరు వున్న మురళీ మోహన్‌కి కూడా ఈ సందర్భంగా కోపం వచ్చింది. ‘‘అనుకోకుండా జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధపడుతున్నాయి. భారీగా ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇంకా అనేక చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ పరామర్శకు వచ్చిన వారిని ఇలా నిలదీయడం న్యాయం కాదు’’ అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.